TS Politics : తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ.. నేతలతో మంతనాలు..?

.TS Politics : తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ.. నేతలతో మంతనాలు..?

TS Politics : తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ జరుగుతుందా.. ఇప్పటికే పలు పార్టీలు తమ ప్రాబల్యం కోసం ప్రజల్లోకి వెళుతుంటే తాజాగా మరో పార్టీని ఏర్పాటు చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. అయితే అది కూడా కాంగ్రేస్ పార్టీ నాయకత్వం నుండి రావడం విశేషం.

 • Share this:
  తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీకి అంకురార్పణ జరగనుంది. అయితే ఈ పార్టీని
  మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్‌ ఈ పార్టీని ఏర్పాటు చేసేందుకు సమయాత్తమవుతున్నారు. పార్టీ ఏర్పాటు చేసే పనుల్లో ఆయన ఇప్పటికే నిమగ్నమైవున్నట్టు సమాచారం. ఇందులో నేపథ్యంలోనే ఆయన బుధవారం తన తన మద్దతుదారులు, అనుచరులతో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో సమావేశమయినట్టు తెలుస్తోంది.

  అయితే కొత్త పార్టీని ఎందుకు స్థాపించాలనుకుంటున్నారో ఆయన తన అనుచరులతో స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సాధనలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నారని, అయినా.. అందరికీ న్యాయం జరగడం లేదని అందుకే.. అందరికి న్యాయం జరగాలనే ప్రధాన డిమాండ్‌తో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక కొత్త పార్టీని కూడా ఈ సంవత్సరంలోని డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును, జెండా, అజెండాను ప్రకటిస్తామని చెప్పారు.

  ఇది చదవండి : నేనే గోంతు కోసి హత్య చేశాను.. చందానగర్ హత్యకేసులో వీడిన మిస్టరీ..


  కాగా రాజకీయ ప్రయాణంలోకి ఆయన్ను డాక్టర్ మిత్ర లాగారని గుర్తుచేసుకున్న ఆయన. 2014 జులై 27న మాసాయిపేట రైల్ ప్రమాదం నన్ను కలచివేసిందని తెలిపారు. ఇక, చదివించటం ప్రభుత్వ బాధ్యత కాదా..? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో స్టాండర్డ్స్‌ కూడా లేవని విమర్శించారు.

  ఇప్పటికే మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌..( RS praveen kumar ) కొత్త పార్టీ పెట్టకపోయినా బీఎస్పీలో చేరి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పనిచేస్తున్నారు.. మరోవైపు.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల ( YS sharmila ) కూడా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించి.. పాదయాత్రను కూడా చేపట్టారు. ఇప్పుడు డాక్టర్ వినయ్‌ కుమార్‌ కూడా ( Dr Vinay kumar ) పొలిటికల్‌ పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్‌ హాట్‌ టాపిక్‌గా మారిపోతున్నారు.

  ఇది చదవండి : ఆర్టీసీ డ్రైవర్‌కు.. డ్రైవింగ్‌లో ఫిట్స్... తప్పిన పెను ప్రమాదం


  తెలంగాణలో ఇప్పటికే ఇటివల రెండు కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ( ys sharmila ) తన పార్టీ కార్యకలాపాలను ప్రారంభించారు. తన పార్టీని బలోపేతం చేసేందుకు సుదీర్ఘ పాదయాత్రను సైతం చేపట్టారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన షర్మిల ఆ దిశగా ప్రజల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు ఇటివల పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బీఎస్పీలో( bsp ) చేరి ఆ పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే దిశంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే బీఎస్పీ గతంలో యూపీలో ( up ) అధికారం చెపట్టి ప్రస్తుతం ఎలాంటీ అధికారం లేకుండా ఉంది. కాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి కన్వినర్‌గా కొనసాగడంతో ఆ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.

  దీనికి తోడు మరో జాతీయ పార్టీ సైతం తెలంగాణలో తన కార్యకలాపాలాను ముమ్మురం చేయనున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆ పార్టీ బెంగాల్‌లో అధికారంలో ఉంది. తాజాగా ఆ పార్టీ అధినేత మమత బెనర్జీ సైతం ( tmc ) తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆమెకు ఉన్న రాజకీయ అనుభవంతో రాష్ట్రంలో కొంత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇన్ని పార్టీలు పెడుతుండడంతో ఏ వర్గం వారు పార్టీలోకి వెళతారు. తాజా నేతలు ఎవరు ప్రస్తుతానికి వెళ్లకపోయినా... మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల్లో అవకాశాలు లభించని వారు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే అన్ని పార్టీలు పూర్తి కార్యచరణలోకి వస్తేగాని ఎవరు పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది తేలనుంది.
  Published by:yveerash yveerash
  First published: