Home /News /telangana /

ONE MORE MICRO FINANCE INSTITUTE NAMED AS MUDRA HAS SHUTDOWN THE DOORS ADB VRY

Adilabad : నిర్మల్‌లో బోర్డు తిప్పిన ముద్ర ఫైనాన్స్ .. స్థానికుల ఆందోళణ..

ముద్ర ఫైనాన్స్..

ముద్ర ఫైనాన్స్..

Adilabad : రాష్ట్ర వ్యాప్తంగా మరో ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగు చూశాయి.. గత కొద్ది రోజులుగా ఆయా జిల్లాల్లో బోర్డు తిప్పుతున్న ముద్ర ఆగ్రికల్చర్ సోసైటి తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా బోర్డు తిప్పింది.

    అధిక వడ్డీలు, మైక్రో ఫైనాన్స్ వ్యవహారాలు నడుపుతున్న ఓ సంస్థ బోర్డు తిప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తన కార్యకలాపాలు ప్రారంభించిన ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ పలు జిల్లాల్లో బోర్డులు తిప్పుతోంది. వ్యవసాయ రుణాల పేరుతో మైక్రో ఫైనాన్స్ కార్యాకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ పలు జిల్లాలో కార్యాలయాలు ఓపెన్ చేసి.. అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడంతో పాటు ఉద్యోగుల చేత డిపాజిట్లు సేకరించడం, మరోవైపు సంస్థలో పనిచేసే ఉద్యోగుల నుండి స్వయంగా లక్షల రూపాయలు సేకరించింది. డబ్బులు ఇచ్చిన వారికే ఉద్యోగాలు కూడా కట్టబెట్టి వారి ద్వారా ఆయా జిల్లాల్లోని డిపాజిట్లు సేకరించింది. ఇలా సేకరించిన డిపాజిట్లను తిరిగి ఇవ్వకుండా బోర్డు తిప్పేస్తోంది.

    ఇలా తాజాగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ దుకాణ సముదాయంలో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టిస్ట్రేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థగా ప్రచారం చేశారు. తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రచారం చేశారు. అధిక వడ్డీ ఆశ కల్పించి భారీగా డిపాజిట్లను సేకరించారు. పొదుపు పేరిట లక్షల రూపాయలను సంస్థలో డిపాజిట్ చేశారు. భైంసా పట్టణంలో సుమారు 250 మంది ఖాతాదారులు ఉన్నట్లు సమాచారం. చిరు వ్యాపారులు, దినసరి కూలీలు డిపాజిట్ చేశారు.

    ఇది చదవండి : నలుగురు పిల్లలు ఉన్నా.... ప్రియుడితో ఉంటానంటూ.. మహిళ ఫిర్యాదు..


    ఈ సంస్థకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 25 శాఖలు చెబుతున్నారు. అయితే డిపాజిట్ల గడువు తీరడంతో సొమ్ము చెల్లించాలని ఖాతాదారులు కార్యాలయాని వెళితే రేపు, మాపు, పండుగ తర్వాత అంటు నాన్చుతున్నట్లు ఖాతాదారులు వాపోతున్నారు. సంస్థ కార్యాలయానికి గత 15 రోజుల నుండి తాళం వేసి ఉండటంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి 30వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు తిరిగి చెల్లించాల్సి ఉందని ఖాతాదారులు పేర్కొంటున్నారు.

    ఇది చదవండి : వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటి.


    కాగా శాఖ కార్యాలయం ఉన్న దుకాణ సముదాయంలోని టిఫిన్ సెంటర్ యజమాని శంకర్ ఖాతా తెరిచి రోజుకు 200 రూపాయల చొప్పున ఆరు నెలలుగా 36వేల రూపాయలు, మరో ఓ హోటల్ వ్యాపారి రమణ 300 రూపాయల చొప్పున 40వేల రూపాయలు జమ చేశామన్నారు. దుకాణం అద్దెలు చెల్లించాల్సి ఉందని డబ్బులు చెల్లించాలని కోరగా నేడు, రేపు చెల్లి స్తామన్నారని, పక్షం రోజుల నుంచి కార్యాలయమే తెరవడం లేదని పొదుపుదారులు ఆందోళన చెందుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Fraud schemes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు