తెలంగాణకు చెందిన మరో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులతో పాటు యువకులైన ఇద్దరు కొడుకులు కూడా వారితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా అప్పులబాధను భరించలేకపోతున్నట్టు బంధువులకు పంపిణ మెసెజ్’లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే వారందరు విజయవాడ దుర్గమ్మ దర్శనం తర్వాత సత్రంలో ఇద్దరు , కృష్ణానదిలో దూకి ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు కుటుంబసభ్యులు, సురేశ్ ,శ్రీలత, బార్యభర్తలతో పాటు ఇద్దరు కుమారులు ఆశీష్, అఖిల్‌లు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఉన్న కన్యకాపరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అప్పుల బాధతో చనిపోతున్నట్లు వారి బంధువుకు మెసేజ్ సైతం పెట్టారు.
Vanama Raghava : ముగిసిన విచారణ, వనమా రాఘవ కోర్టుకు, ఆయనపై పన్నెండు కేసులు .. ఎం చెప్పాడంటే...
వెంటనే స్పందించిన బంధువు సత్రం నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పడంతో హుటాహుటిన వెళ్లి చూడగా తల్లీ శ్రీలతతో పాటు మరోకుమారుడు అప్పటికే చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కాగా వారిపక్కన మందులు సైతం ఉన్నట్టు గమనించారు. ఆ తర్వాత తండ్రి సురేశ్‌తో పాటు మరో కుమారుడు కృష్ణనదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం అప్పుల వాళ్ల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనావేశారు. మృతుల కుటుంబానికి ఓ పెట్రోల్ బంకుతో పాటు మెడికల్ షాపు కూడా ఉన్నట్టు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Nizamabad