Home /News /telangana /

ONE MORE DALIT GIRIJAN MEETING IN IBRAHIMPATNAM SAID REVANTH REDDY VRY

Revanth reddy :ఇబ్రహీంపట్నంలో ఈ నెల 18 న మరో దళిత, గిరిజన సభ

Revanth reddy

Revanth reddy

Revanth reddy :కాంగ్రెస్ పార్టీ మరో దళిత, గిరిజన సభను నిర్వహించేందుకు సిద్దమవుతుంది. నేడు ఇంద్రవెల్లి సభ విజయ వంతం కావడంతో మరో నాలుగు సభలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత దండోరా సభను నిర్వహిస్తామని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా దళితులతోపాటు గిరిజనులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పార్టీ రానున్న రోజుల్లో ఆందోళన చేసేందుకు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేసింది.

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. ఈ నేపథ్యంలోనే ఇంద్రవెల్లిలో దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అనంతరం ఇదే ఉత్సహాంతో మరిన్ని సభలను నిర్వహిస్తామని ప్రకటించింది..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున తరలించి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

    ఈ నేపథ్యంలోనే రేపటి నుండి సెప్టెంబర్ 17 వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఆయన చెప్పారు.ఈ సంధర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత, గిరిజన ఆదివాసిలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు.ఇక ఈ కార్యక్రమానికి సెప్టెంబర్ మొదటి వారం రాహుల్ గాంధీ హాజరు కానున్నారని ఆయన నిన్న ప్రకటించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు సభలను నిర్వహించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

    ఇక ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది. పాత కొత్త పార్టీ నేతలంతా ఒకే వేదిక మీద ఎలాంటి విభేదాలు లేకుండా సభ కొనసాగింది..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలనే యోచనలో ఆపార్టీ ఉంది....
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Congress, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు