Home /News /telangana /

ONE MAN FIRE HIS BYKE BECAUSE HE DONT WANT TO PAY E CHALLANS IN VIKARABAD NGS

E-Challan: ఈ చలానాలు కట్టమంటే ఏం చేశాడో తెలుసా.. విషయం తెలిసి షాక్ తిన్న పోలీసులు

చలాన్ కట్టమేంటే బైక్ తగలెట్టిన యువకుడు

చలాన్ కట్టమేంటే బైక్ తగలెట్టిన యువకుడు

ఓ వైపు కరోనా కష్టకాలం.. మరోవైపె పెరిగిన పెట్రోల్ రేట్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు ఇప్పుడు చలాన్ల మోత మోగుతోంది. దీంతో ఆవేశంతో రగిలిపోతున్నారు యువత.. ఓ యువకుడ్ని చలాన్లు కట్టాలని పోలీసులు అడిగితే ఏం చేశాడో తెలుసా..?

ఇంకా చదవండి ...
    E-Challan: దేశ వ్యాప్తంగా కొత్త వాహన చట్టం వచ్చిన తరువాత వహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అసలే కరోనా కష్ట కాలం.. ఆదాయం లేక జనం ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి మూడు పూటలు తినడమే కష్టంగా ఉంది. ఆదాయ మార్గాలు సగానికి సగం పడిపోయి.. రేట్లన్నీ మండిపోతున్నాయి. సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇక రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్ రేట్లు చూసి జనం కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. వీటికి తోడు ఫైన్లతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఇంతకముందు అంటే రూల్స్ ఉల్లంఘిస్తే యాభై లేద వందో ఫైన్ వేసి వదిలేసేవారు. కానీ దేశంలో కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత పాపం వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు వస్తాయనే గాని, చట్టాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి. అందు కోసమే చట్టాలను కఠినం చేస్తున్నారు. చట్టాలను అందరు చుట్టాలుగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే.. ప్రభుత్వం చట్టాలను కఠినం చేసేంది. కానీ ఆ చలానాలను వాహనదారులు భరించలేం బాబోయ్ అంటున్నారు. సాధారణంగా ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే..? భారీ స్థాయిలో చలనాలను తీసుకొస్తే.. తప్పుడు మార్గాల్లో వెళ్తే డబ్బులు కట్టాల్సి వస్తుంది అనే సత్యం బోధపడుతుందని.. ఆ ఫలితంగా ఎవరు తప్పుడు మార్గాల్లో నడిచేందుకు సాహసం చేయరని జరిమానాల మోత మోగిస్తున్నారు. అయినా కొందరు అడ్డదిడ్డంగా రూల్స్ బ్రేక్ చేస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు కెమెరాలు పట్టుకొని చలానాలు ఆన్ లైన్లో విధిస్తున్నారు. అవి కాకుండా ట్రాఫిక్ కెమెరాల ద్వారా కూడా ఈ చలానాలు వస్తూనే ఉన్నాయి.

    అలా వస్తున్నప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి కదా.. అలా కూడా లేకుండా రూల్స్ బ్రేక్ చేసి చివరికి పోలీసులు చలానాలు కట్టమంటే ఓ వ్యక్తి ఏకంగా బండినే తగలబెట్టేశాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. టీఎస్ 34 డీ 2183 నెంబర్‌ గల ద్విచక్రవాహనంపై 5,500 రూపాయల చలానాలున్నాయి. బండిని ఆపిన పోలీసులు చలానాలు కట్టమన్నారు.

    కూలీగా పనిచేసే తాను ఇంత మొత్తాన్ని ఎలా కట్టగలనని బండి యజమాని సంగప్ప ప్రశ్నించాడు. పోలీసులు కాదు కుదరదని తెగేసి చెప్పడంతో బండిని తగలబెట్టేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఆవేదనతోనే తాను బైక్‌ను తగలబెట్టానని చెప్పాడు. బైక్ తనకు అత్తింటివారు బహుమానంగా ఇచ్చారని..కానీ చలానాలు, పెరిగిన పెట్రోల్ ధరలతో ఈ బండిని తిప్పలేనని.. అదే లేకుంటే ఏ చలానాలు ఉండవనే ఇలా చేశానంటున్నాడు. దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Telangana, Traffic challans, Vikarabad district

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు