Home /News /telangana /

ONE KILLED AND TWO INJURED IN CYLINDER BLAST INSIDE TEMPLE CANTEEN IN VANASTHALIPURAM AREA OF HYDERABAD

గుళ్లో సిలిండర్ బ్లాస్ట్ బీభత్సం..మంటల్లో కాలిపోయి మహిళ మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఒకరికి, కిటికీ అద్దం పగిలి గాజు పెంకులు గుచ్చుకుని మరొకరికి గాయాలయ్యాయి. వారిద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శృతికీర్తి అనే మహిళ చనిపోయింది.

    సిలిండర్ బాంబ్ మళ్లీ పేలింది. కాప్రాలో వంట గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన మరవకముందే..హైదరాబాద్‌లో మరో బ్లాస్ట్ జరిగింది. వనస్థలిపురం సోమనాథక్షేత్రంలోని కిచెన్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఒకరికి, కిటికీ అద్దం పగిలి గాజు పెంకులు గుచ్చుకుని మరొకరికి గాయాలయ్యాయి. వారిద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శృతికీర్తి అనే మహిళ చనిపోయింది. లలిత అనే మరో మహిళలకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

    పేలుడు ధాటికి ఆలయం చుట్టుపక్కల ఉన్న ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 8 ఇళ్ల కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై చుట్టుపక్కల ప్రజలను ఆరా తీస్తున్నారు పోలీసులు. సీఐ వెంకటయ్య ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

    కాగా, నాలుగు రోజుల క్రితం కాప్రాలోనూ ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. మోహన్ లాల్ చౌదరి అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరు మరణించారు. పేలుడు సమయంలో రోడ్డుపై వెళ్తున్న రవి అనే వ్యక్తితో పాటు మరొకరు చనిపోయారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఐదు ఇళ్లు ధ్వంసమవగా..మరో ఇళ్లు పాక్షికంగా కూలిపోయింది. 4 రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో రెండో సిలిండర్ పేలుడు ఘటన జరగడం.. నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది.

    Video: ఆయిల్ ట్యాంకర్- బస్సు ఢీ.. 27 మంది మృతి
    First published:

    Tags: LPG Cylinder, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు