హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sri Rama Navami 2022: అంతటా రాములోరి లగ్గం..! ప్రతి ఇంటా ప్రతి ధ్వనిస్తున్న "జై శ్రీరామ్" నినాదాలు

Sri Rama Navami 2022: అంతటా రాములోరి లగ్గం..! ప్రతి ఇంటా ప్రతి ధ్వనిస్తున్న "జై శ్రీరామ్" నినాదాలు

ఇవాళ శ్రీరామనవమి.. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముని పవిత్ర ఆలయం భద్రాచలంతో పాటు ప్రతి ఊరు, వాడలో మరి కాస్సేపట్లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది

ఇవాళ శ్రీరామనవమి.. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముని పవిత్ర ఆలయం భద్రాచలంతో పాటు ప్రతి ఊరు, వాడలో మరి కాస్సేపట్లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది

ఇవాళ శ్రీరామనవమి.. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముని పవిత్ర ఆలయం భద్రాచలంతో పాటు ప్రతి ఊరు, వాడలో మరి కాస్సేపట్లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది

(న్యూస్. 18, మహబూబ్ నగర్.. సయ్యద్ రఫీ)

ఇవాళ శ్రీరామనవమి (Sri Rama Navami).. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముని పవిత్ర ఆలయం భద్రాచలంతో పాటు ప్రతి ఊరు, వాడలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం (Sitaramula Kalyanotsavam) జరిగింది.  మహబూబ్ నగర్ (Mahbubnagar)  వెంకటేశ్వర స్వామి దేవలయం, వేరన్నపేట్ పదమతి కాలనీ, రాం మందిర్, ఛోరాస్తా పాటు నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణం కన్నుల విందుగా జరిగింది. మహబూబ్ నగర్  లో హిందూ వాహిని ఆధ్వర్యంలో సాయంత్రం "శోభాయాత్ర" సైతం చేయనున్నారు. అయితే జిల్లాలో శ్రీరామనవమి (Sri Rama Navami). పురస్కరించుకుని ప్రతి ఇంటిపై  "భగవత్ ధ్వజాలు", కాషాయ జెండాలు, కటౌట్ బ్యానర్లతో కళకళలాడుతున్నాయి.

మహబూబ్ నగర్  నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా మండలాల్లో ప్రత్యేకంగాశ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండు సంవత్సరాలు కోవిడ్ కారణంగా వేడుకలు ఆలయాల్లో అంతర్గతంగా జరుపుకున్నారు. ఇప్పుడు కోవిడ్ మహమ్మారి లేక పోవడంతో ప్రజలు స్వేచ్చా యుతంగా వేడుకలకు సిద్ధం అయ్యారు.

పోటెత్తిన భక్తజనం..

వెంకటేశ్వర స్వామి దేవలయం, శివ మారుతి గీతా మందిరం, మార్వాడి రాం మందిర్,  పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, ఊరు వాడల్లో కల్యాణ మహోత్సవం జరిగింది. శ్రీరాముని ఆలయలతో పాటు అన్ని దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.  సీతారాముల కళ్యాణోత్సవం కూడా జరిగింది. ఆయా దేవాలయాల్లో జరిగిన కళ్యాణోత్సవానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు.

ఆయా దేవాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ శ్రీరామునికి ధ్రువమూర్తుల తిరుకళ్యాణం జరిగింది. అనంతరం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకూ ఉత్సవమూర్తులకు అలంకారం జరిగింది. 9 గంటల 30 నిమిషాల్నించి 10 గంటల 30 నిమిషాల వరకూ సీతారామ ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుంది. 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకూ కళ్యాణ మండపంలో సీతారాముల తిరు కళ్యాణం జరిగింది. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల్నించి 1 గంట వరకూ ఉత్సవమూర్తుల్ని కళ్యాణమండపం నుంచి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు.

అభిజిత్ లగ్న సముహూర్తాన..

1 గంట నుంచి మద్యహ్మిక ఆరాధన రాజభోగం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తాన జరిగే కళ్యాణాన్ని వీక్షించేందుకు  భారీగా భక్తులు తరలివస్తారు. నిన్న అంటే శనివారం రాత్రి అన్ని రామాలయ ప్రాంగణంలో ఎదుర్కోలు ఉత్సరవం, గరుడ సేవ కన్నుల పండువగా జరిగాయి. ఉత్తర ద్వారం వద్ద అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుడికి ఎదుర్కోలు బ్రహ్మోత్సవం ఘనంగా జరిగింది.

ఇక మహబూబ్ నగర్  పట్టణంలో సాయంత్రం హిందూ వాహిని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు పార్టీలకు అతీతంగా తరలివస్తున్నారు. అదేవిధంగా హిందూ వాహిని ఇచ్చిన పిలుపు మేరకు భగవత్ ధ్వజాలు కాశాయి జెండాలు ప్రతి ఇంటి పై రెపరెపలాడుతున్నాయి. అదేవిధంగా పట్టణ చౌరస్తాలో కాషాయమయమైంది. కాషాయ జెండాలు, కటౌట్ బ్యానర్లతో కళకళలాడుతోంది..

First published:

Tags: Mahbubnagar, Sri Rama Navami 2022, Srirama navami

ఉత్తమ కథలు