కేటీఆర్ పుట్టిన రోజుకి కవిత ఇచ్చిన అందమైన గిఫ్ట్...

కేటీఆర్‌తో సెల్ఫీ తీసుకుంటున్న కవిత (ఫైల్ ఫోటో)

KTR Birthday | తన అన్నయ్య కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ పాత మధురమైన ఫొటోను షేర్ చేశారు కవిత.

 • Share this:
  తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ శ్రేణులు కూడా తమ ప్రియతమ నేతకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే, వారందరిలోకీ స్పెషల్ గా నిలిచారు కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత. తన అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఆ పాత మధురమైన ఓ ఫొటోను షేర్ చేశారు. కేటీఆర్, కవిత చిన్న పిల్లలుగా ఉన్నప్పటి ఫొటో అది. ఆ ఫొటోను పరిశీలిస్తే కేటీఆర్ వయసు సుమారు 4 నుంచి 5 ఏళ్లు ఉండొచ్చు. కవిత వయసు రెండేళ్లు ఉండొచ్చు. తెల్లటి చుక్కల చొక్కా వేసుకున్న కేటీఆర్, ఆ పక్కనే ఫ్రాక్ వేసుకున్న కవిత బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేశారు కవిత. ‘ ఏదో సామెత చెప్పినట్టు పొరుగువారిని, తోబుట్టువులను మనం ఎంచుకోలేం. నా లాంటి చెల్లెలు ఉన్నందుకు నువ్వు ఎంత అదృష్టవంతుడివి. ఈ రోజు నీ పుట్టిన రోజు. నీ లాంటి రాక్ స్టార్ అన్నయ్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్య.’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి కవిత ట్వీట్ చేశారు.  కవిత ట్వీట్ ‌కు కేటీఆర్ స్పందించారు. థాంక్యూ మోడెస్ట్ పప్ అంటూ రీ ట్వీట్ చేశారు.  మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖల నుంచి కేటీఆర్‌కు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: