ON THE DEATH OF FAMOUS WRITER KANDIKONDA YADAGIRI TELANGANA CM KCR EXPRESSED HIS CONDOLENCES PRV
Kandikonda: సినీ రచయిత కందికొండ యాదగిరి మృతి.. స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
కందికొండ , సీఎం కేసీఆర్ (ఫైల్)
రచయిత కందికొండ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ (యాదగిరి) మృతి కి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ (famous writer Kandikonda Yadagiri) మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ (cancer) వ్యాధితో బాధపడుతున్న కందికొండ (యాదగిరి) మృతి కి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ (Telangana) సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ (Kandikonda) మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ (Kandikonda) అని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు.
కందికొండ (Kandikonda) ను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించక పోవడం దురదృష్టమని సీఎం (CM KCR) అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రభుత్వం చేయూత..
గతంలో కందికొండ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఆయన ఆస్పత్రి చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. కందికొండ గత కొన్ని రోజులుగా త్రోట్ క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. దీంతో చికిత్సలో భాగంగా రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరంగల్ వాసి కందికొండ..
1973 అక్టోబర్ 13న వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరలోని నాగురపల్లె గ్రామంలో పుట్టాడు కందికొండ. ఆయనకు చిన్నతనం నుంచి సాహిత్యం అంటే ప్రాణం. దాంతో డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రితో ఉన్న అనుబంధంతో పాటల రచయితగా ఇండస్ట్రీలో తనదైన ముద్రని వేసుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలోని మల్లికూయవే గువ్వా కందికొండ రాసిన ఫస్ట్ సాంగ్. ఈ సాంగ్ హిట్ కావడమే కాదు.. చక్రికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన అన్ని సినిమాల్లో కందికొండ పాటలు రాశారు.
ఆయన పాటలు హిట్ అయినా.. ఆయనకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు.కలంతో పదాల సంకలనం. సాహిత్యంతో సంగమం. పదాలతో పాటల ప్రయోగం. అన్నింటా ఆరితేరిన సాహితికొండ కందికొండ.. 2001లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కందికొండ తక్కువ టైంలో వెయ్యి పాటల టార్గెట్ ను పూర్తి చేశారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన చివరగా శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోతల రాయుడు’ సినిమాలో ‘ఓ తలపై’ పాటను రాశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.