Murder : భార్యభర్తల మధ్య పంచాయితీకి వెళ్లిన మధ్యవర్తి బలి...!

Murder : భార్యభర్తల మధ్య పంచాయితీకి...వెళ్లిన మధ్యవర్తి బలి.. (ప్రతీకాత్మక చిత్రం)

Murder : భార్యభర్తల మధ్య పంచాయితీ చెప్పినందుకు, ఓ మహిళ నిండు ప్రాణాలు బలిగొన్నాడు..బాత్రుంలో నీళ్లు రావడం లేదంటూ ఇంట్లోకి పిలిచి తన ల్యాప్‌టాప్ వైర్‌‌ను గొంతుకు బిగించి హత్య చేశాడు. కాగా ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది.

  • Share this:
    హైదరాబాద్ నగర జీవనంలో పక్కింట్లో ఏం జరిగినా..పట్టించుకోరు.. సాధరణంగా ఆపార్ట్‌మెంట్ కల్చర్‌తో పాటు సగటు హైదరాబాద్ జీవనం ఇలా కొనసాగుతుంటుంది. అయితే ఒకే ఇంట్లో ఉంటున్నందుకు ఓ మహిళ పెద్దమనిషి ఇద్దరు భార్యభర్తల మధ్య జోక్యం చేసుకుంది..భార్యను ఎప్పుడు హింసిస్తున్న భర్తను మందలించింది..ఇలా ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఎప్పుడు ఇద్దరి మధ్య గొడవ వచ్చినా సర్థిచెప్పి ఎవరి తప్పు ఉంటే వారిని మందలించేది..

    అయితే ఈ మందలింపులను, మధ్యవర్థిత్వాన్ని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తట్టుకోలేకపోయాడు. నిత్యం భార్యతో ఘర్షణ పడడం అలవాటు పోయినా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పట్టింపులకు పోయాడు..అయితే ఇవేమి పట్టించుకోని మధ్యవర్తి ..మాములుగానే తీసుకుంది..చివరకు ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు దారుణంగా వ్యవహరించి హత్య చేసిన సంఘటన అల్వాల్‌లోని కానాజిగూడలో చోటు చేసుకుంది.

    అల్వాల్‌లో నివాసం ఉంటున్న రాజేస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి, అయితే నిత్యం భార్యతో గొడవ పెట్టుకునేవాడు..దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో అదే ఇంట్లో ఉండే మంగతాయారు 75 ఉంటుంది. కాగా రాజేష్ దంపతులకు పది రోజుల క్రితం గొడవలు కావడంతో మంగతాయారు వెళ్లి సర్థిచెప్పింది. అయినా..రాజేష్ భార్య పుట్టింటికి వెళ్లింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా..భార్య వెళ్లిపోయిన తర్వాత రాజేష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు మానసిక ఆందోళనకు గురయ్యాడు.

    ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజేష్ మంగతాయారు బిల్డింగ్ పైకి వెళ్లడం చూశాడు. ఆ తర్వాత ఇంట్లో నల్లాలు రావడం లేదంటూ ఆమెను ఇంట్లోకి పిలిచాడు. ఇంట్లోకి రాగానే ఆమెను హత్య చేశాడు. చీరతో కాళ్లు చేతులు కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. అనంతరం తన ల్యాప్‌టాప్ కేబుల్‌తో మెడకు చుట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిమీద ఉన్న బంగారు గాజులు తీసుకుని శవాన్ని తన ఇంట్లోనే బాత్‌రూంలో పడేశాడు. బంగారు నగలు బయట కుదువపెట్టి డబ్బులు తీసుకున్నాడు.

    అయితే మంగతాయారుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె అదే కాలనీలో ఉంటుండగా ఓ కొడుకు ఆర్మీలో కల్నల్‌ కాగా మరొకరు ఆమెరికాలో ఉంటున్నారు. దీంతో అమెరికాలో ఉంటున్న కుమారుడు ఫోన్ చేస్తున్నా మంగతాయారు ఫోన్ తీయకపోవడంతో అనుమానంతో తన సోదరికి చేశాడు..సోదరి వెళ్లి చూడగా తల్లి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    దీంతో అదే ఇంట్లో ఉన్న రాజేశ్ ‌ను పోలీసులు ప్రశ్నించారు. అయితే పోలీసులు ప్రశ్నలకు తడబడిన రాజేష్ వెంటనే తలుపులు వేసుకున్నాడు. అనుమానంతో మరోసారి రాజేశ్ ఇంట్లోకి వెళ్లి పరీశీంచారు. దీంతో బాత్‌రూంలో మంగతాయారు శవం కనిపించింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజేశ్ డబ్బుల కోసమే ఆమెను హతమార్చాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published: