కరీంనగర్‌లో దారుణం... కరోనా అనుమానంతో తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు

కరోనా వచ్చిందనే అనుమానంతో కన్నతల్లి పట్ల కఠినంగా వ్యవహరించారు ఆమె కొడుకులు.

news18-telugu
Updated: May 29, 2020, 4:28 PM IST
కరీంనగర్‌లో దారుణం... కరోనా అనుమానంతో తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష చూపించవద్దని పదే పదే ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా అనుమానంతో కన్నతల్లి పట్ల కఠినంగా వ్యవహరించారు ఆమె కొడుకులు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో కరోనా అనుమానంతో కన్నతల్లినే ఇంటి నుంచి బయటకు గెంటేశారు ఆమె కొడుకులు. కరీంనగర్‌కు చెందిన శ్యామల అనే వృద్ధురాలు కొద్ది నెలల క్రితం మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లింది. అయితే లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల పాటు అక్కడే చిక్కుకుపోయింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎలాగోలా కరీంనగర్ చేరుకున్న ఆమెకు కరోనా ఉందేమో అనుమానంతో ఆమె కొడుకులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మండుటెండలో ఎక్కడికి వెళ్లాలో తెలియక... కొడుకుల ఇంటి ముందే కూర్చుండిపోయింది వృద్ధురాలు. మరోవైపు వృద్ధురాలి పట్ల ఆమె కొడుకుల వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
First published: May 29, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading