హోమ్ /వార్తలు /తెలంగాణ /

Viral video : పరిహారం ఇప్పించమని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న వృద్ధుడు .. వైరల్ అవుతున్న వీడియో

Viral video : పరిహారం ఇప్పించమని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న వృద్ధుడు .. వైరల్ అవుతున్న వీడియో

Viral video

Viral video

Viral video: రిజర్వాయర్‌ నిర్మాణం కోసం భూమిని కోల్పోయిన ఓ వృద్ధుడు స్థానిక ఎమ్మెల్యేను పరిహారం కోసం బ్రతిమిలాడుతున్న దృశ్యం అందర్ని ఆలోచింపచేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఆదృశ్యం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

పాలకులు ప్రజల మొర ఆలకించే రోజులు ఉన్నాయా ..? ప్రభుత్వ పరిహారం కోసం నిర్వాసితులు ప్రజాప్రతినిధుల కాళ్ల, వేళ్లా పడాల్సిందేనా..? ప్రాధేయపడినా ప్రయోజనం ఉండటం లేదా ..? కనికరించి సాయం చేస్తారనే నమ్మకం కలిగడం లేదా ..? యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri)జిల్లాలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో విస్తృతంగా వైరల్(Viral) అవుతోంది. రిజర్వాయర్‌(Reservoir)కోసం భూమిని కోల్పోయిన ఓ వృద్ధుడు స్థానిక ఎమ్మెల్యే(MLA)ను పరిహారం కోసం బ్రతిమిలాడుతున్న దృశ్యం అందర్ని ఆలోచింపచేస్తోంది.

Telangana : ఆ చెట్టు ఆకులు తెంచినా.. అక్కడ మాట్లాడినా అరిష్టమట..ఇంతకీ ఏంటా సీక్రెట్.. ఆ చెట్టు ఎక్కడుంది..?

పరిహారం కోసం కాళ్లపై పడిన వృద్ధుడు..

ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ...ఏ పనులు ప్రారంభించినా అది ప్రజల ప్రయోజనం కోసమే అయి ఉండాలి. కాని ప్రజల ఆస్తులకు భంగం వాటిల్లడం, కనీసం వారికి పరిహారం కూడా అందకపోవడం వంటి సమస్యలు తరచూ ఉత్పన్నమవుతూనే ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సోమవారం బతుకమ్మ చీరలు పంపిణి చేయడానికి బస్వాపురం గ్రామానికి వెళ్లిన సమయంలో ఓ వృద్ధుడు ఆయన కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. సార్‌ మీ కాళ్లు మొక్కుతాను ..నాకు పరిహారం కింద పైసలు ఇప్పించడం సార్ అంటూ వేడుకోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

వైరల్ అవుతున్న వీడియో..

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కాళ్లపై పడి బ్రతిమిలాడిన వృద్ధుడి పేరు ఉడుత అంజయ్య. బస్వాపురం రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల్లో ఒకరు. ఎమ్మెల్యే తన గ్రామానికి వచ్చిన విషయం తెలుసుకున్న అంజయ్య ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి అయ్యా రిజర్వాయర్ నిర్మాణంతో తన వ్యవసాయ భూమితో పాటు బోరు పోయిందని ఎమ్మెల్యే ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. పొలం, బోరు పోగొట్టుకున్న తనకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని దయచేసి ఆ డబ్బులు ఇప్పించగలరంటూ కాళ్లపై పడి దండం పెట్టి మరీ వేడుకున్నాడు. బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితుడు ఎమ్మెల్యే కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడుతున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Farmer Success : మూడున్నర నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం .. బోడ కాకరకాయ సాగులో సీక్రెట్‌ అదేనంటున్న రైతు

న్యాయం చేస్తారనే భరోసా ఇవ్వరా..?

ఇంత జరిగితే వృద్ధుడికి న్యాయం చేస్తానని మాటివ్వాల్సిన ప్రజాప్రతినిధి కనీసం భరోసా ఇవ్వకుండా ఆరోజు నిర్వాసితుల జాబితాలో మీరు పేరు ఎందుకు రాయించుకోలేదని ప్రశ్నించారు. మీ పేరు లేనప్పుడు అధికారుల్ని కలిసి విషయాన్ని చెప్పకుండా ఇప్పుడు చెబితే ఎలా అంటూ ఎదురు ప్రశ్నలు వేయడంతో బాధితుడు అంజయ్యతో పాటు అతనికి మద్దతుగా నిలిచిన మరికొందరు గ్రామస్తులు అవక్కయ్యారు. చేసేది ఏమి లేక నోరు వెళ్లబెట్టి ఎమ్మెల్యే చెబుతున్న మాటలు వినాల్సిన పరిస్థితి కనిపించింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Bhuvanagiri, Telangana News

ఉత్తమ కథలు