హోమ్ /వార్తలు /తెలంగాణ /

Chalk Eating Old Lady: మూడు పూటలా సుద్ద ముక్కలే ఆమెకు ఆహారం.. 14 ఏళ్లుగా సుద్ద గడ్డలు తింటున్న వృద్ధురాలు

Chalk Eating Old Lady: మూడు పూటలా సుద్ద ముక్కలే ఆమెకు ఆహారం.. 14 ఏళ్లుగా సుద్ద గడ్డలు తింటున్న వృద్ధురాలు

ఆహారంగా

ఆహారంగా ప్రతిరోజు సుద్ద గడ్డల తింటున్న వృద్ధురాలు

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడికి విరుద్ధంగా గత 14 సంవత్సరాలుగా సుద్దగడ్డలే పరమాన్నంగా తింటూ ఒకే బావి‌ నీరు తాగుతుంది ఓ వృద్ధురాలు. రాజన్నసిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌ గ్రామానికి చెందిన చింతాకుల మల్లవ్వ గురించే మనం చెప్పుకుంటుంది

ఇంకా చదవండి ...

  (K. Haribabu, News18, Rajanna siricilla)

  నచ్చిన వంటకాన్ని కడుపు నిండా తింటే అందులో ఉండే తృప్తే వేరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భోజన ప్రియులు, ఎన్నో వెరైటీల వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శాకాహారం, మాంసాహారం అంటూ మనుషులు తినే ఆహారాన్ని బట్టి, వారి అభిరుచిని బట్టి రకరకాల వంటకాలను ఎంచుకుంటారు. ఆకుకూరలు, పండ్లు మాత్రమే తినే వారిని శాకాహారులని, మాంసం తినే వారిని మాంసాహారులు అని పిలుస్తున్నాము. మరి ఇవేవి కాకుండా సుద్ద ముక్కలు (Chalk) తినే వారిని ఏమనాలి?. ఏంటీ..? వండి తినే వంటకాలు కాకుండా..ఇలా సుద్ద ముక్కలు/సుద్ద గడ్డలు తినే వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్య పోతున్నారా?. ఈ కథాకమామీషు తెలుసుకోవాలంటే మీరు రాజన్నసిరిసిల్ల  (Rajanna siricilla) జిల్లా బందనకల్ (Bhandankal) గ్రామానికి వెళ్ళాలసిందే.

  14 ఏళ్లుగా సుద్ద ముక్కలు. సుద్ద గడ్డలే ఆహారం..

  అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడికి విరుద్ధంగా గత 14 సంవత్సరాలుగా సుద్దగడ్డలే పరమాన్నంగా తింటూ ఒకే బావి‌ నీరు తాగుతుంది ఓ వృద్ధురాలు. రాజన్నసిరిసిల్లా (Rajanna siricilla) జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌ గ్రామానికి చెందిన చింతాకుల మల్లవ్వ (Chinthakula Mallavva) గురించే మనం చెప్పుకుంటుంది. అన్నానికి (Food) బదులు మూడు పూటలా సుద్దగడ్డలను (Chalk) తీసుకుంటూ జీవిస్తోంది. ఈ విచిత్రస్థితిని చూసిన కొడుకు, కోడలు మల్లవ్వను ఆసుపత్రికి తీసుకెళ్లగా మల్లవ్వను పరీక్షించిన వైద్యులు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. గత దశాబ్దన్నర కాలంగా ఊరులో ఉన్న ఒకే బావి నీరు త్రాగుతూ, అన్నానికి బదులు సుద్దగడ్డలను తింటూ జీవిస్తున్న మల్లవ్వను చూసి బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.

  పురుగులుగా కనిపిస్తున్న అన్నం, తింటే కడుపు నొప్పి..

  చింతాకుల మల్లవ్వ - మల్లయ్య దంపతులది వ్యవసాయాధారిత‌ కుంటుంబం. కొన్నేళ్ల క్రితం ఎప్పటిలాగే వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి చేరుకున్న మల్లవ్వ (Mallavva) ఆకలిగా ఉండడంతో కంచంలో అన్నం పెట్టుకుని తినడానికి ప్రయత్నించగా అన్నం అస్సలు సహించలేదు. కంచంలో ఉన్న ఆహారమంతా పురుగులుగా కనిపించడంతో అన్నాన్ని పడేసి ఆకలితోనే ఆ రాత్రి పడుకుంది. మర్నాడు ఉదయం మళ్లీ ఆకలి వేయడంతో కోడలు అన్నం వండి పెట్టింది. అప్పుడు కూడా అన్నం సహించక తినలేదు. కోడలు కారణం అడగ్గా..తనకు అన్నం పురుగులుగా కనిపిస్తుందంటూ మల్లవ్వ సమాధానం ఇచ్చింది. అయితే ఆకలిగా ఉండడంతో సుద్ద ముక్క  (Pure clay) నమిలి తినడం మొదలు పెట్టింది.

  అలా అప్పటి నుండి 14 సంవత్సరాలుగా ఆహారాన్ని ముట్టకుండా, సుద్ద గడ్డలు తింటూ బ్రతికేస్తుంది మల్లవ్వ. ఒకవేళ బలవంతంగా అన్నం తింటే ఆరోజు మొత్తం కడుపునొప్పితో అల్లాడిపోతుందని మల్లవ్వ మనవడు అంటున్నాడు. 'నాకు ఊహ తెలిసిన నాటి నుంచి మా అవ్వ అన్నం తినడం చూళ్లేదు. అప్పుడప్పుడు అటుకులు తింటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుద్ద గడ్డ నములుతూ, బావి నీళ్లు మాత్రం తాగుతుంది' అని మల్లవ్వ మనవడు చెప్పుకొచ్చాడు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Food, Local News, Rajanna, Siricilla, WOMAN

  ఉత్తమ కథలు