Home /News /telangana /

Nizamabad కోడుకుకు భారం అవుతున్నామని కఠిన నిర్ణయం తీసుకున్న దంపతులు

Nizamabad కోడుకుకు భారం అవుతున్నామని కఠిన నిర్ణయం తీసుకున్న దంపతులు

 భారం అవుతున్నామని కఠిన నిర్ణయం తీసుకున్న దంపతులు

భారం అవుతున్నామని కఠిన నిర్ణయం తీసుకున్న దంపతులు

Nizamabad : తమ కడుపున పుట్టిన పిల్లలకు భారం కాకుడదనే ఆలోచనతో ఓ వృద్ద జంట కఠిన నిర్ణయం తీసుకున్నారు..కష్టం చేసుకుని తినే శక్తిలేక, మంచానపడి ఇతరుల సహాయంతో బతుకు వెళ్లదీస్తున్నభార్యభర్తలు జీవితంపై విరక్తి చెందారు..దీంతో తమ కొడుకు ఉన్నప్పుడే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...
నిజామాబాద్ జిల్లా,,
న్యూస్18తెలుగు ప్ర‌తినిధిః పి మ‌హేంద‌ర్,

పక్షవాతంతో మంచం పట్టినా భార్య‌... ఆమెకు సేవలు చేసిన భర్త అనుకోని ప్రమాదంలో తాను మంచానికి పరిమితమయ్యారు. నరకయాతన అనుభవిస్తున్న భార్య ఒక వైపు... బార్య‌కు ఏమీ చేయలేక పోతున్నాన‌నే బాధ మరోవైపు.. ఈ సంఘర్షణకు చావే మార్గం అనే నిర్ణయం తీసుకునేలా చేసింది. తాళి కట్టిన చేతితోనే భార్యకు ఉరివేసి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోచోటు చేసుకుంది.

కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన శంకర్ గారి సిద్దయ్య, బాల‌మ‌ణి దంప‌తులు.. వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం.. వీరికి ఒక కుమారుడు రాజు ఉన్నారు.. కాగా కొడుకు రాజు బ్ర‌తుకు దేరువుకోసం గ‌ల్ఫ్ దేశం వెళ్లాడు.. అయితే సిద్దయ్య భార్య బాలమణి నాలుగేళ్ల క్రితం పక్షవాతంతో మంచం పట్టింది. దీంతో కోడలు బాలమణి కి సేవలు చేస్తోంది.

అయితే కొద్ది రోజుల క్రితం దురదృష్టవశాత్తు సిద్దయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్ప‌టి నుంచి సిద్ద‌య్య కూడ ఆనారోగ్యం పాలయ్యాడు.దీంతో సిద్ద‌య్య రాను రాను త‌న ప‌నులు కూడా తాను చేసుకోలేని స్థితికి చేరాడు..ఓవైపు కళ్ళెదుటే భార్య పడుతున్న అవస్థలు, మరోవైపు ఆమెకు ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నాడు. దీంతో కుమారుడికి కోడలికి భారంగా జీవితం మారిందనే బాధ మ‌రోవైపు.. ఈ క్ర‌మంలో కొన్నాళ్లుగా మానసికంగా కుంగిపోయినా సిద్ద‌య్య‌ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చావు అని నిర్ణయించుకున్నారు... మరోవైపు కోడుకు తన కూతురు పెళ్లి కోసం వచ్చి పెళ్లి కూడ చేసి తిరిగి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాడు.

దీంతో భార్య బాలమణిని మంచం పక్కనే ఉన్న కిటికీకి చీరతో ఉరి వేసి చంపేశాడు. అనంతరం సిద్దయ్య ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా అత్త బాల‌మ‌ణి కిటికికీ వేలాడడాన్ని పక్కింట్లో ఉండే కోడలు గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు తెరిచింది. అప్పటికే ఇద్దరు చనిపోవడంతో నిర్ఘాంతపోయారు. కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రురల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Crime news, Family suicide, Nizamabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు