హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cycle Ride : ఆత్మహత్యల నివారణకు 73 ఏళ్ల వయసులో సైకిల్ యాత్ర... ! ఏపీ టు ఢిల్లీ...

Cycle Ride : ఆత్మహత్యల నివారణకు 73 ఏళ్ల వయసులో సైకిల్ యాత్ర... ! ఏపీ టు ఢిల్లీ...

Cycle Ride : ఆత్మహత్యల నివారణకు 73 ఏళ్ల వయసులో సైకిల్ యాత్ర... !

Cycle Ride : ఆత్మహత్యల నివారణకు 73 ఏళ్ల వయసులో సైకిల్ యాత్ర... !

Cycle Ride : ఆత్మహత్యల నివారణకు 73 సంవత్సరాల వృద్దుడు సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు.. ముఖ్యంగా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువకులకు సందేశం ఇవ్వడం కోసం ఏపీలోని ఏలూరు నుండి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టాడు. కాగా ఆ యాత్ర నేడు ఆదిలాబాద్‌ జిల్లాకు చేరుకుంది.

ఇంకా చదవండి ...

  ఆత్మహత్యలు ( suicide ) చేసుకునే ముందు ఎక్కడికైన విహార యాత్రకు వెళ్లండని చెబుతున్నాడు డెబ్బె మూడెళ్ల శ్రీరాంమూర్తి.. అప్పుడు అసలైన నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నాడు. అయితే ఇందుకోసం ఆయన సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.. అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే టూ వీలర్ లేదా ఫోర్ వీలర్‌ను ఆశ్రయించ ప్రస్తుత తరణంలో ఆయన సైకిల్ యాత్ర చేపట్టాడు. అదికూడ ఏపీ నుండి ఢిల్లీ వరకు. అదికూడా యువత కోసం దీంతో ఆయన చేపట్టిన యాత్రం పలువురు నేతలు అధికారులు అయన్ను అభినందిస్తున్నారు.

  వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ ( andrapradesh ) రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామానికి చెందిన మాజేటి శ్రీరాంమూర్తి ఈ నెల మూడవ తేదీన ఆత్మహత్యల (suicide ) నివారణకు యువతీ యువకుల్లో అవగాహన కల్పించేందుకు ఏలూరు నుండి సైకిల్ యాత్ర ప్రారంభించారు. కాగా ఆ సైకిల్ యాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లా (adilabad )ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్ర దేశ రాజధాని ఢిల్లీ వరకు కొనసాగుందని ఆయన పేర్కొన్నారు. సైకిల్ యాత్ర ( cycle ride ) చేపట్టిన శ్రీరాంమూర్తికి ఇంద్రవెల్లి ఎస్.ఐ. నందిగామ నాగ్ నాథ్, స్థానికులు స్వాగతం పలికి అభినందించారు.

  ఇది చదవండి : కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటి అయిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసులపై లేఖ


  ఇది చదవండి : వరుసకు సోదరుడు.. కాని కూల్‌డ్రింక్ తాగివెళ్దాం అన్నాడు.. మత్తుమందు కలిపి.


  ఈ సందర్భంగా శ్రీరాంమూర్తి యువతకు సందేశం ఇచ్చాడు.. నేటి యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా 73 ఏళ్ల వయస్సులోను తాను సైకిల్ యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తున్నానని, యువత తాను చేస్తున్న సైకిల్ యాత్రను చూసి జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని మనసుంటే మంచి మార్గం ఉంటుందని, ఎవరు ఆవేశాలకు లోను కాకుండా ఇలా సైకిల్ యాత్రను చేపట్టి విహారయాత్రలకు వెళితే మనసు మారే అవకాశం ఉంటుందనే అంశాన్ని తెలిపారు..

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Adilabad, Bycycle

  ఉత్తమ కథలు