ఏడు పదుల వయస్సులో ఎంత కష్టం...సాకే వారు లేక వృద్ద జంట ఏం చేశారో తెలుసా ?

ఏడు పదుల వయస్సులో ఎంత కష్టం...సాకే వారు లేక వృద్ద జంట ఏం చేశారో తెలుసా ?

suicide

ఏడు పదుల వయస్సులో ఎంత కష్టం...సాకే వారు లేక వృద్ద జంట ఏం చేశారో తెలుసా.. ఇటివల తమ ఇద్దరు కుమారులు మృత్యువాత పడడంతో ఆందోళన చెందిన వృద్ద జంట.. తీర్థయాత్రలకని అనంతలోకాలకు

  • Share this:
కని, పెంచిన సంతానం తమ కళ్లముందే మృత్యువాతపడితే ఆ భాద వర్ణనాతీతమే, అదికూడ ఆరుపదుల వయస్సు దాటిన తర్వాత తమ సంతానం కనీసం ఒక్కరైన మిగలకుండా పోతే ఇక ఆ తల్లిదండ్రుల భాద ఎవరికి చెప్పలేని వ్యధ అవుతుంది. దీంతో  ఆ తల్లి దండ్రులు తాము  ఇంకా బతికి ఎవరి కోసమనే నైరాశ్యంలోకి  వెళ్లడం సమాజాంలో పరిపాటిగా మారింది. ఇలాంటీ దయనీయ సంఘటనే నిజామాబాద్ జిల్లాలో  చోటుచేసుకుంది. ఏడు పదులు దాటిన వృద్ద దంపతులకు తమ ఆలన పాలన చేసే దిక్కు లేక ఇద్దరు భార్య భర్తలు తనువు చాలించారు. అదికూడ తమ బంధువులకు కూడ భారం కావద్దని స్వంత రాష్ట్ర్రం వీడి పక్క రాష్ట్ర్రంలో ప్రాణాలు విడిచారు.

వివరాల్లోకి వెళితే, మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిలోలి గ్రామనికి చెందిన వృద్ధ దంపతులు గంగాధర్ (80) మహనందా (75 )లకు ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే ఇద్దరు కూడ గత కొద్ది కాలం క్రితం మృత్యువాత పడ్డారు. దీంతో తమను పట్టించుకునే పరిస్థితిలేకపోవడంతో జీవీతం పై విరక్తి చెందారు. ఇద్దరికి ఏడుపదుల వయస్యు దాటడంతో వారి జీవిన విధానంలో ఇబ్బందులు కూడ ఏర్పడ్డాయి.

దీంతో ఇద్దరు కలిసి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. అయితే జీవితం చివరి అంకంలో దేవుడిని దర్శించుకోవాలనుకుని మహారాష్ట్ర నుండి బయలు దేరి తిరుపతికి చేరుకున్నారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అక్కడి నుండి బాసరలోని సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే రాత్రి విశ్రాంతి తీసుకున్నారు.

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపం లోని కొచ్చరి మైసమ్మ దేవాలయం వద్ద వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్థానిక పోలీసులకు విషయం చేరడంతో కేసును నమోదుచేసుకుని దర్యాప్తు చేయడంతో ఇద్దరు కుమారులు చనిపోవడంతో జీవితంపై విరక్తి చేందారని, దీంతో  ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని బంధువులు భావిస్తున్నట్టు పోలీసులు వివరించారు. కాగా మృతదేహాలను పోస్ట్ మర్టం కోసం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి  తరలించారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు