• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • OJA ARTISTS WHO GIVE LIFE TO MARVELOUS ART FORMS AT ADILABAD IN TELANGANA ADB SRD

Telangana : అద్భుత కళారూపాలకు ప్రాణం పోస్తున్న ఓజా కళాకారులు..(వీడియో)

Telangana : అద్భుత కళారూపాలకు ప్రాణం పోస్తున్న ఓజా కళాకారులు..(వీడియో)

అద్భుత కళారూపాలకు ప్రాణం పోస్తున్న ఓజా కళాకారులు..

Telangana : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ కళాకారుల నైపుణ్యం ఆకట్టుకుంటోంది. ఇత్తడితో అద్భుతమైన కళారూపాలకు ప్రాణం పోస్తున్నారు. అన్ని రకాల కళారూపాలను అందంగా రూపొందిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు.

  • Share this:
    ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ కళాకారుల నైపుణ్యం ఆకట్టుకుంటోంది. ఇత్తడితో అద్భుతమైన కళారూపాలకు ప్రాణం పోస్తున్నారు. అన్ని రకాల కళారూపాలను అందంగా రూపొందిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు. తమ కళా నైపుణ్యంతో అబ్బురపరుస్తున్నారు ఓజ (డోక్ర మెటల్ క్రాఫ్ట్) కళాకారులు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఆదివాసీల కళకు దేశ,విదేశాల్లో ఖ్యాతి ఉంది. ఈ ప్రాంతంలో ఇత్తడిని కరిగించి చేసే డోక్ర మెటల్ క్రాఫ్ట్ కళాకృతులు నయనానదకరంగా ఉంటాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఈ కళ పై ఆధారపడి దాదాపు 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరు తమ పూర్వీకుల నుంచి వస్తున్నసంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇత్తడితో అనేక కళారూపాలకు అవలీలగా ప్రాణం పోస్తారు. దేవత మూర్తుల విగ్రహాలతో పాటు చిన్నారుల ఆట వస్తువులు, నెమలి, హంస ఆకృతులు, పూల కుండీలు, వివాహాలో అవసరమయ్యే సృజనాత్మక వస్తువు సామాగ్రి. దీపక కుందులు, ఇలా అనేక వస్తువులు ప్రాణం పోసుకునేది ఇక్కడే. గుడి గంటలు, ఏనుగు, గణపతి, ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా విగ్రహాన్ని అందంగా తయారు చేయడంలో వారికివారే సాటి. ముందుగా అనుకున్న కళారూపాన్ని మనసులోనే ఊహించుకుంటూ సన్నటి మట్టితో తయారు చేస్తారు. తర్వాత మైనంతో అచ్చు తయారు చేసి కరిగించిన ఇత్తడితో ఓ రూపం తీసుకొస్తారు.

    ఈ మొత్తం ప్రక్రియలో వారసత్వంగా వచ్చిన హస్తకళ నైపుణ్యమే వారికి ఆధారం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయే దాక వివిధ సృజనాత్మక ఆకృతులు అందంగా మలచడమే వారి వ్యాపకం. తమ ప్రతిభకు గుర్తింపుగా పలువురు రాష్ట్రపతులు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల నుంచి ఎన్నో ప్రశంసలు, సత్కారాలు ఈ కళాకారులు పొందారు. దేశ రాజధాని డిల్లి సహా ప్రముఖ నగరాల్లో ఆదిలాబాద్ డోక్ర క్రాఫ్ట్ తో ప్రదర్శనలు నిర్వహించారు. హరప్పా మొహంజొదారో కాలంలో కళాఖండాల తయారీలో ప్రస్థానం ప్రారంభమై కాలం గడిచే కొద్ది వంటింటి పాత్రల నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ తమ కీర్తిని నలుచేరువుల వ్యాపింపజేశారు.

    రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) ఆదిలాబాద్ డోక్ర కళాకృతులకు వరించింది. అంతటి ఖ్యాతి కలిగిన ఈ కళా అంతరించే ప్రమాదం పొంచి ఉంది. కొత్తవారు ఈ వృత్తిలోకి రాకపోవడం, ఈ కళను నేర్చుకోవాలన్న ఆసక్తి కొరవడం, ఉన్నవారికి సదుపాయాలు లేక పోవడం, ముడి సరుకు సమస్యలు వంటివి ప్రతిబంధాకాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు