హోమ్ /వార్తలు /తెలంగాణ /

Face book love : సోమ్ము ఆయనది..సోకు ప్రియుడికి..! పెళ్లయిన నెలకే....

Face book love : సోమ్ము ఆయనది..సోకు ప్రియుడికి..! పెళ్లయిన నెలకే....

భర్త ఫోన్ గిఫ్ట్, ఫోన్లో ప్రియుడితో చాటింగ్..పెళ్లయిన నెలకే ప్రియుడితో జంప్ ..చదువు లేకున్నా..ఫేస్‌ 
ప్రేమాయణం

భర్త ఫోన్ గిఫ్ట్, ఫోన్లో ప్రియుడితో చాటింగ్..పెళ్లయిన నెలకే ప్రియుడితో జంప్ ..చదువు లేకున్నా..ఫేస్‌ ప్రేమాయణం

mahabubnagar : భర్త గిఫ్ట్, ఫోన్లో ప్రియుడితో చాటింగ్..పెళ్లయిన నెలకే ప్రియుడితో జంప్ ..చదువు లేకున్నా..ఫేస్‌ ప్రేమాయణం.. దీంతో పెళ్లయిన నెలకే అందరిని వదిలి ప్రియుడి వద్దకు చేరిన యువతి

  న్యూస్ 18 మహబూబ్ నగర్...

  సయ్యద్ రఫీ..

  ఆధునిక జీవనంలో పెళ్లి అనే బంధానికి రూపం మారుతోంది. భవిష్యత్ ఆలోచన లేక..యువతి యువకులు ప్రస్థుత అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు..తదనంతరం తాము భావించిన విధంగానే ముందుకు సాగుతున్నారు. దీంతో అటు కొన్ని సంఘటనల్లో యువతులు బలి అవుతుంటే..మరికొన్ని సంఘటనల్లో యువకులు సైతం బలి అవుతున్నారు..

  ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమని పలువురి జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఫోటోలు,చాటింగ్‌లతో ఎదుటి వారి మాయలో పడడం..అనంతరం తమకు ఉన్నవారందరని వదులుకుని వారితో వెళ్లిపోవడం సామాన్యంగా మారుతోంది..

  ఇటివల కరీనంగర్ జిల్లాలోని ఫేస్‌బుక్ ద్వార పరిచయమైన వివాహిత ఓ ఎస్సైని నమ్మి తనభర్తకు విడాకులు ఇచ్చింది. చివరికి ఎస్సైకి పెళ్లి అయిందని తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే మరో యువతి సైతం ఫేస్‌బుక్ ప్రేమకు దాసోహం అయింది..దీంతో పెళ్లయిన నెలకే భర్త, కుటుంభసభ్యులు వదిలి వెళ్లిపోయి.. ప్రియుడితో వివాహం చేసుకున్న మరో ఘటన వనపర్తి జిల్లా పరిధిలోగల అమరచింత మండలంలో చోటు చేసుకుంది .

  అమరచింత పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం వివరాలు.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన యువతికి అదే మండలానికి చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం మైంది. ఆమెతో మాట్లాడుకోవడానికి కాబోయే భర్త ఆమెకు స్మార్ట్ ఆర్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్ లో ఫేస్ బుక్ ద్వారా అమరచింత మండలం సింగం పేట గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు పరిచయం అయింది.దీంతో చాటింగ్,సంక్షిప్త సందేశాలతో ప్రేమగా మారింది.

  ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండగానే స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమై..పెళ్లి జరిగింది..అయితే భర్తతో నెల రోజులు కూడా సరిగా కాపురం చేయని ఆ యువతి , ఇంట్లో చెప్పాపెట్టకుండా ఆమె ప్రియుడు గ్రామానికి వచ్చేసింది. వారిద్దరూ గ్రామ పరిధిలోని స్థానిక దేవాలయంలో వివాహం కూడా చేసుకున్నారు.

  అయితే యువతి మిస్సింగ్ పై హనుమకొండ పోలీస్ స్టేషన్లు లో యువతి తల్లి కేసు నమోదు చేసింది. పోలీసులు వివరాలు సేకరించి అమరచింత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు.దీంతో ఎస్ఐ యువతిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లి సమక్షంలో హనుమకొండ పోలీసులకు ఆమెను అప్పగించారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Mahabubnagar, Telangana

  ఉత్తమ కథలు