OFTER DISCHARGE A CORONA GOT WOMAN PLNTS SAPLING IN GOVT HOSPITAL VS
corona : ప్రభుత్వ ఆసుపత్రల వైద్యంపై ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయా ?
కోవిడ్ చికిత్స అనంతరం మొక్కను నాటుతున్న మహిళ
corona : ప్రభుత్వ ఆసుపత్రులంటే కొంతమంది ఖేదం మరికొంతమందికి మోదం అన్నట్టుగా తాయారైంది..కరోనా చికిత్సలపై కొంతమంది వ్యతిరేక అభిప్రాయంతో ఉంటే మరికోంతమంది మాత్రం ప్రభుత్వ వైద్యం వల్లే బతికి బట్టకట్టామని చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల దృక్పథం మారుతుందా...కరోనా భారీన పడుతున్న ప్రజలు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారా...అంటే కొన్ని చోట్ల ప్రభుత్వం చర్యలపై వ్యతిరేకత ఉన్నా..మరి కొన్ని చోట్ల మాత్రం వారి దృక్పథం ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై సానూకూలంగా స్పందిస్తున్నారు..ప్రభుత్వ వైద్యంతోనే తాము బతికి బట్టకట్టామని చెబుతున్నారు. ఇందుకు కృతజ్ఝతగా తమకు తోచింది చేస్తున్నారు.
తెలంగాణాలో ప్రభుత్వ ఆసుపత్రులపై కొంతమంది రోగుల వైఖరిలో మార్పులు వస్తున్నాయి. కరోనా చికిత్సలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రతి పక్ష పార్టీలు విమర్శిస్తున్నా.. ప్రజలు మాత్రం కొన్ని చోట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇటివల మంచిర్యాల జిల్లా చెందిన గాంధీకి చేతులెత్తి మొక్కిన మహిళి ఫోటో వైరల్ కాగా తాజాగా మరో మహిళ తనకు చికిత్స అందించిన ఆసుపత్రి ఆవరణలో మొక్కను నాటి కృతజ్జత తెలిపింది.
తాజాగా.. గద్వాల్ లో కొవిడ్ తో బాధపడుతూ.. ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందిన ఓ మహిళ కరోనా నుంచి కోలుకొని కృతజ్ఞతగా మొక్క నాటింది. హైదరాబాద్కు చెందిన సుజాత అనే మహిళ కరోనా సోకిందేమోననే అనుమానంతో దవాఖానలో టెస్టులు చేయించుకోవాలనుకుంది. హైదరాబాద్ దవాఖానాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆక్సిజన్ దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో తన పుట్టినిల్లయిన గద్వాలకు చేరుకుంది. స్థానిక జిల్లా దవాఖానలో చేరింది. ఆక్సిజన్, పడకలు అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స పొందింది. చికిత్స తర్వాత కరోనా పరీక్షల్లో నెగటివ్ గా తేలింది. డాక్టర్లు ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.
తన ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ దవాఖాన ఆవరణలో కృతజ్ఞతా భావంతో సుజాత ఒక మొక్కను నాటింది.ఆక్సిజన్ నిల్వలు లేక అనేక మంది చనిపోతున్న తరుణంలో ప్రభుత్వ దవాఖానలో తనకు మంచి వైద్యం అందించినందుకు డాక్టర్లకు సైతం ఆమె ధన్యవాదాలు చెప్పింది.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.