హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: బతుకమ్మ ఆడలేదని ముస్లిం, క్రిస్టియన్ ఆయాలకు జీతం కట్...!

Karimnagar: బతుకమ్మ ఆడలేదని ముస్లిం, క్రిస్టియన్ ఆయాలకు జీతం కట్...!

బతుకమ్మ

బతుకమ్మ

Karimnagar: బతుకమ్మ తమ పండుగ కాదని, ఆడడం తమ మతానికి విరుద్ధమని చెప్పినా వినిపించుకోలేదని ఓ ఆయా గోడు వెల్లబోసుకున్నారు. నెలకు వచ్చే వేతనం రూ.7800 నుంచి రూ.500 కోత పెడితే తమ కుటుంబాన్ని ఎలా పోషించేదని ఆమె వాపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(శ్రీనివాస్. పి, న్యూస్ 18తెలుగు, కరీంనగర్ ప్రతినిధి)

తెలంగాణ  (Telangana) రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుతోంది. ఎమ్మెల్సీ కవిత  (MLC Kavitha) నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగను ఘనంగా నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన బతుకమ్మ పండుగలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొనాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మంచిర్యాలలో కూడా బతుకమ్మ వేడుకలు (Bathukamma Festival) ఘనంతగా జరిగాయి. డిపార్టుమెంట్ల వారీగా మహిళా ఉద్యోగులు తొమ్మిది రోజుల పాటు మంచిర్యాల జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. కలెక్టర్ భారతి హోళికేరి బతుకమ్మ ఆడి కింది స్థాయి ఉద్యోగులు, మహిళల్లో ఉత్సాహం నింపారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

ఐతే బతుకమ్మ ఆడలేదనే కారణంతో జిల్లాలోని కొందరు అంగన్వాడీ ఆయాలకు అలాగే స్కూల్ టీచర్స్‌కి వేతనాలను అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. బతుకమ్మ పండుగను హిందూ మహిళలు ఆడడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా మతాలకతీతంగా బతుకమ్మలో పాల్గొనాలని అంగన్వాడీ ఆయాలను ఆదేశించారు. కొందరు క్రిస్టియన్, ముస్లిం మహిళలు బతుకమ్మ ఆడలేదనే నెపంతో వారి వేతనాల్లో రూ.500 చొప్పున9 రోజుల జీతం మినహాయించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాధితురాలి వేతనం నిలిపి వేయగా తన పేరు ప్రస్తావించవద్దని తెలిపింది. బతుకమ్మ ఆడలేదనే నెపంతో పై ఉద్యోగులు ఆయాలకు గైర్హాజరు వేయడంతో సెప్టెంబరు నెల వేతనంలో కోత విధించినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బతుకమ్మ తమ పండుగ కాదని, ఆడడం తమ మతానికి విరుద్ధమని చెప్పినా వినిపించుకోలేదని ఓ ఆయా గోడు వెల్లబోసుకున్నారు. నెలకు వచ్చే వేతనం రూ.7800 నుంచి రూ.500 కోత పెడితే తమ కుటుంబాన్ని ఎలా పోషించేదని ఆమె వాపోయారు. జిల్లా వ్యాప్తంగా 969 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఆ సంఖ్యకు సరిపడా ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ ఆయాల్లో సుమారు 150 వరకు ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు. తాము బతుకమ్మ ఆటకు రాలేమని, తమ వేతనం నిలిపివేయవద్దని అధికారులను వేడుకొన్నా కనికరించలేదనే విమర్శలున్నాయి. స్వయంగా కలెక్టరే బతుకమ్మ ఆడగాలేంది.. మీకేంటి అభ్యంతరం అని ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తంగా బతుకమ్మ సమయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

First published:

Tags: Bathukamma, Bathukamma 2022, Telangana

ఉత్తమ కథలు