news18-telugu
Updated: November 4, 2020, 9:55 PM IST
ఎంపీపీ శారద
పదవుల్లో ఉంటే అంతా మాట వింటారు అని చాలామంది భావిస్తుంటారు. అందుకే ఆ పదవి దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇక ఆ పదవి అధికార పార్టీ నేతకు దక్కితే.. వారి మాటకు తిరుగుండదని అంతా అనుకుంటారు. కానీ అందరి విషయంలో ఇలాగే ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఒక్కసారి పదవిలో ఉన్నా... అందులోనూ అధికార పార్టీకి చెందిన వారైనా... వారి మాట పట్టించుకునే వాళ్లు ఉండరు. నేతలు, అధికారులు.. ఇలా చాలామంది వారి మాటలను, ఆదేశాలను లైట్ తీసుకుంటారు. ఇలాంటి నేతల్లో చాలామంది తమ పరిస్థితి ఇంతే అనుకుని సర్దుకునేవాళ్లు ఉంటారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నేత మాత్రం.. తన మాట ఎవరూ వినడం లేదని మీడియా ముందే వాపోయింది.
ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శారద.. తన మాట ఎవరూ వినడం లేదని వెక్కి వెక్కి ఏడ్చారు. అధికార పార్టీకి చెందిన తన మాటే వినకుంటే ఎలా అని ప్రశ్నించారు. రైతు వేదికల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తే తన మాట ఎవరు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట వినకపోగా తనకు విలువ కూడా ఇవ్వలేదన్నారు. ఇదేంటని అడిగితే నువ్వెంత..నీ వయసెంత అని మాట్లాడారని.. తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయాన్ని జడ్పీ ఛైర్మన్, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదనిశారద వాపోయారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 4, 2020, 7:49 PM IST