Rythu bheema : రైతు బీమాలో మరో మోసం.. కొడుకు ఆటకట్టించిన అధికారులు

(ప్రతీకాత్మక చిత్రం)

Rythu bheema : ఇటివల రైతు బీమా డబ్బుల కోసం ఓ మహిళా రైతు బతికి ఉన్నా...చనిపోయిందంటూ రైతు బీమా సోమ్మును కాజేసిన సంఘటన మరవకముందే...తాజాగా మరో కొడుకు బతికున్న తండ్రి చనిపోయాడంటూ రైతు బీమాకు ధరఖాస్తు చేసుకున్నాడు..అయితే ఇటివల సంఘటలతో అప్రమత్తమైన అధికారులు ఆ కోడుకు ఆట కట్టించారు.

  • Share this:
    ఇటివల రైతు భీమా డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తమ ఏరియాల్లో ఇలాంటీ సంఘటనలను క్షుణ్ణంగా పరీశీలిస్తున్నారు. ధరఖాస్తులు చేసిన వాటిపై విచారణ చేపట్టిన తర్వాతే ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి చనిపోకున్నా..డెత్ సర్టిఫికెట్ సంపాదించి రైతు బీమా పొందేందుకు ధరాఖాస్తు చేసుకున్న కొడుకుకు చెక్ పెట్టారు.

    వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం మల్కాపూర్ లో ఈ సంఘటన వెలుగు చూసింది. మండల వ్యవసాయ అధికారి రఘురాం కథనం ప్రకారం గ్రామానికి చెందిన చాకలి కాశన్న కు మల్కాపూర్ శివారులో 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అంతకు ముందు ఆ భూమి కాశన్న భార్య పేరు మీద ఉండగా ఆమె చనిపోవడంతో తిరిగి కాశన్న పట్టా చేయించుకున్నాడు. కాగా బీమాలో భాగంగా నామినిని ఆయన కొడుకు రాములు పేరును పెట్టాడు. ఇక గ్రామంలో పరిస్థితులు బాగా లేక భూమికి ఇతరుకు అప్పగించిన రాములు కుటుంబం తన తండ్రితోపాటు హైదరాబాద్ వలస వెళ్లాడు. కాగా కాశన్న కొద్ది రోజుల క్రితమే ఇంటినుండి తప్పిపోయాడు. ఆయన ఇంటికి రాకపోవడంతో కొడుకు రాములు రైతు బంధు డబ్బుల కోసం స్కెచ్ వేశాడు. ఎక్కడ ఉన్నాడో తెలియని తండ్రి కరోనాతో చనిపోయాడంటూ అసలు విషయం దాచిపెట్టి గ్రామ పంచాయితీ కార్యాలయం నుండి డెగ్ సర్టిఫికెట్ సంపాందించాడు. అనంతరం జూన్ 6న మరణించాడని స్థానిక వ్యవసాయ కార్యాలయంలో రాములు దరఖాస్తు చేశాడు.

    కాగా ఇటివల రైతు బంధు కోసం జరుగుతున్న మోసం వెలుగు చూడడంతో స్థానిక అధికారులు అలర్ట్ అయ్యారు. పెండింగ్‌లో ఉన్న రైతు బంధు ధరఖాస్తులను క్షుణ్ణంగా పరీలించారు. ఇందులో భాగంగానే కాశన్న మరణంపై కూడా విచారణ చేపట్టిన అధికారులు కాశన్న హైదరాబాద్ లో తప్పిపోయినట్టు తెలిసింది. విషయం దాచి గ్రామపంచాయితీ కార్యాలయం నుండి డెత్ సర్టిఫికెట్ పొందినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో నిందితుడు మోసపూరితంగా వ్యవహారించారంటూ స్థానిక ఎంపీడివోకు ఫిర్యాదు చేశారు.అయితే మల్కాపూర్ పంచాయితీ సెక్రటరి తాను బంధువులను విచారించి డెత్ సర్టిఫికెట్ ఇచ్చానని సమాధానం చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రాములుపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.ముందస్తుగా అధికారులు అప్రమత్తం కావడంతో రైతు బంధులో మరోమోసం జరగకుండా అడ్డుకోల్గామని చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published: