రైతు పొట్టకొట్టి సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌కు రోడ్డు...

ఎలాంటి భూసేకరణ, టెండరు లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టారు. పంట పొలాలను ధ్వంసం చేస్తూ 50-60 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మిస్తున్నారు.

news18-telugu
Updated: December 26, 2019, 10:19 PM IST
రైతు పొట్టకొట్టి సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌కు రోడ్డు...
పొలంలో బోరు వేస్తున్న రైతు, సీఎం కేసీఆర్
  • Share this:
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ నుంచి యాదాద్రిలో ఆలయానికి వెళ్లేందుకు కేసీఆర్ కోసం ఏకంగా ఓ రోడ్డును వేస్తున్నారు రోడ్లు భవనాల శాఖ అధికారులు. అయితే, ఎలాంటి టెండర్ లేకుండా, కనీసం రైతులకు చెప్పకుండా, భూసేకరణ గురించి కూడా వివరించకుండా, నష్టపరిహారం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఓ రైతు పొలంలో బోరు మూసేసి మరీ రోడ్డు వేస్తున్నారు. ఇందేంటని అడిగిన రైతుకు ‘ఇది సీఎం ఆదేశం. నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదు.’ అంటూ అధికారులు దబాయిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఉన్న ఎర్రవెల్లి గ్రామం నుంచి యాదగిరిగుట్టకు నేరుగా విశాలమైన రహదారి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదించారు. ఎర్రవెల్లి నుంచి కొండాపూర్‌ వరకు ఇప్పటికే రహదారి ఉంది. అక్కడి నుంచి వాసాలమర్రి వరకు 4.6 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేయనున్నారు. ఇందుకు రూ.7 కోట్లు మంజూరు చేశారు. యాదగిరిగుట్ట ఆలయ ఉద్ఘాటన నాటికి ఎర్రవెల్లి నుంచి యాదాద్రికి కేసీఆర్‌ నేరుగా రాకపోకలు సాగించడానికి అనువుగా రోడ్డును సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో తుర్కపల్లి మండలం వాసాల మర్రి గ్రామానికి చెందిన లక్కాకుల మల్లేశం అనే రైతు పొలంలో బోరుబావిని అధికారులు పూడ్చేశారు. ఎలాంటి భూసేకరణ, టెండరు లేకుండా చేపట్టారు. పంట పొలాలను ధ్వంసం చేస్తూ 50-60 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల ఇళ్లు కూడా తొలగించడానికి సిద్ధమయ్యారు.

కష్టపడి బోరు వేసుకుని పంట సాగు చేస్తుంటే, అధికారులు ఇష్టారాజ్యంగా పూడ్చేయడంతో రైతు కుదేలయ్యాడు. అయినా సరే తన పొలంలో తాను పనిచేసుకోవాలని నిర్ణయించాడు. రైతు బోరును తిరిగి తెరిచాడు. అదనంగా కేసింగ్‌ వేసి, సాగునీటి అవసరాల కోసం తాపత్రయ పడుతున్నాడు. వాహనాలే తిరగని మార్గంలో ఎప్పుడో ఒకసారి సీఎం వెళ్లడానికి తమ పంట పొలాలు, బోరు బావులను పూడ్చి వేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చూడండి :
Published by: Ashok Kumar Bonepalli
First published: December 26, 2019, 9:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading