రాష్ట్రానికి వాయుగుండం ముప్పు.. రైతన్నకు పిడుగు లాంటి వార్త..

ప్రతీకాత్మక చిత్రం

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది ఈ నెల 7న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ వెంటనే వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది.

  • Share this:
    పంటలు బాగా పండినయని అన్నదాత ఆనందపడ్డడు.. కరోనా కష్టకాలంలోనూ పైసలు మంచిగానే వస్తయని సంబురపడ్డడు.. సర్కారే పంటను కొంటదనడంతో మద్దతు ధర దొరుకుతదని ఆశపడ్డడు.. కానీ, అకాల వర్షాలు ఆ ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటను చేజారేలా చేస్తున్నాయి. నోటికాడి బుక్కను లాగేస్తున్నాయి. ఆరబోసిన వడ్లు, ఇతర పంటలను తడిసి ముద్ద చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది రైతులు ఆ దెబ్బకు తల్లడిల్లిపోయారు. అయితే, బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది ఈ నెల 7న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ వెంటనే వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి సర్కారు పంటలను కొనుగోలు చేస్తుందని తెలియడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ధాన్యం బాగా ఆరితే మద్దతు ధర బాగా వస్తుందని.. ఆరుబయట, రోడ్లపై, కళ్లాల్లో ఎక్కడిక్కడ పంటలను పోశారు.

    అయితే, ధాన్యాన్ని ఫంక్షన్‌ హాళ్లు, పాఠశాలల్లో పోసుకొని ఆరబెట్టుకోవచ్చని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు అందుకు అనుమతించటం లేదు. అందుబాటులో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు తాళాలు వేసి ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ క్షణంలో వర్షాలు పడినా తీవ్రంగా పంట తడిసి, అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: