NRI Devender Reddy: ప్రముఖ నాన్ రెసిడెంట్ ఇండియన్ (NRI), TRS పార్టీ అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి నల్లమడను అమెరికాలో దుండగులు హత్య చేసినట్లు తెలిసింది. తెలంగాణ... నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన ఆయనను అమెరికా... న్యూజెర్సీ రాష్ట్రంలోని... ఎడిసన్‌లో డిసెంబర్ 29న మంగళవారం హత్య చేసినట్లు తెలిసింది. ఈ యువ నేత హత్యకు కారణం ఏంటన్నది పోలీసులు ఎలాంటి వివరాలూ చెప్పకపోవడం వల్ల ఈ మర్డర్ పై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఓ సమాచారం ప్రకారం హత్య జరిగిన సమయంలో... దేవేందర్ రెడ్డి తన కారులో కూర్చొని... ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా... ఆయనను హత్య చేశారు. ఓ బాంబు పేలుడు ద్వారా ఈ హత్య చేసినట్లు తెలిసింది. మరో సమాచారం ప్రకారం... ఈ హత్య వెనక అగ్ని ప్రమాదం కారణం కావచ్చని అంటున్నారు. అసలు కారణం ఏంటన్నది దర్యాప్తు తర్వాత అమెరికా పోలీసులు చెప్పనున్నారు.
దేవేందర్ రెడ్డి కూర్చున్న కారుకి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కారు విండో షీల్డ్స్ ఎవరో పగలగొట్టినట్లు ఉంది. చూస్తుంటే... అక్కడేదో పేలుడు జరిగినట్లే కనిపిస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫొటోను షేర్ చేసుకుంటున్నారు.
Sorry to hear about the loss of Devender Reddy Nallamada. Hon'ble Minister @KTRTRS responded immediately to support his family in the hour of need.https://t.co/suvhom603S
అమెరికాలో ఎన్నారై దేవేందర్ రెడ్డి హత్య... (ఫొటోలో దేవేందర్ రెడ్డి కారు - image source - twitter)
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)కి అమెరికాలో అధికార ప్రతినిధిగా ఉన్నారు దేవేందర్ రెడ్డి. వ్యక్తిగా ఆయన చాలా మంచివారు. ఎన్నో సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి సాయం చేశారు. రోజులో ఎప్పుడు ఎవరు సాయం కావాలన్నా ఆయన ఏమాత్రం సంకోచించకుండా ముందుకు వెళ్లేవారని అమెరికాలోని ఆయన స్నేహితులు చెబుతన్నారు. అమెరికాలో తెలంగాణ ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ... అక్కడో తెలంగాణ సొసైటీని ఏర్పాటు చేయడంలో దేవేందర్ రెడ్డి యాక్టివ్ గా పనిచేశారు.
దేవేందర్ రెడ్డి అనుమానాస్పద మృతిపై సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో భారీ ఎత్తున సంతాప సందేశాలు వస్తున్నాయి. చాలా మంది ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎంతో టెక్నాలజీ ఉండే అమెరికాలో... ఎన్నారైలకు రక్షణ లేకుండా పోతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.