ఉల్లితో పోటీ పడుతున్న టమాటా.. కిలో ధర ఎంతో తెలుసా..?

మరోవైపు వర్షాల కారణంగా కొన్ని రకాల కూరగాయలపై మచ్చలు ఏర్పడి.. నాణ్యత దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. దీంతో మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.

news18-telugu
Updated: October 3, 2019, 7:17 AM IST
ఉల్లితో పోటీ పడుతున్న టమాటా.. కిలో ధర ఎంతో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిన్న మొన్నటిదాకా కిలో రూ.10కే దొరికిన టమాటా ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. మార్కెట్లో ఏకంగా రూ.50 దాకా ధర పలుకుతోంది. దీంతో టమాటాలు కొనడానికి సామాన్యుడు ఆలోచిస్తున్న పరిస్థితి.కూరగాయల ధరలు ఇంతలా పెరిగిపోతే ఇంకేం తిని బతుకుతామని సగటు జనం వాపోతున్నారు. అయితే టమాటా ధర ఇంతలా పెరగడానికి కారణం.. ఇటీవల కురిసిన వర్షాలే. భారీ వర్షాల కారణంగా చాలాచోట్ల టమాటా పంట ధ్వంసమైపోయింది.దీంతో మహారాష్ట్ర,కర్ణాటక,ఏపీ నుంచి టమాటాను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.

ఒక లోడ్ టమాటా లారీకి దాదాపు రూ.10వేల దాకా చెల్లిస్తున్నారు. దీంతో టమాటాలను కూడా ధరలు పెంచి అమ్ముతున్నారు.అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. త్వరలోనే ధరలు దిగొస్తాయంటున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొన్ని రకాల కూరగాయలపై మచ్చలు ఏర్పడి.. నాణ్యత దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. దీంతో మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఉల్లిగడ్డ ధర కూడా పైపైకి ఎగబాకుతూనే ఉంది. సెప్టెంబర్ మధ్య వారం వరకు కిలో రూ.20-30 మధ్య ఉన్న ఉల్లి.. అమాంతం రెట్టింపైంది.దీంతో ఉల్లి కొనక ముందే ఉల్లి కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితి. మొత్తం మీద పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యుడిపై భారం పెరుగుతోంది.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు