సామాన్యులకు చుక్కలే.. ఉల్లి ఘాటుకు తోడు టమోటా.. ధర రెట్టింపు..

వర్షాల కారణంగా చాలామంది రైతులు టమోటాను కోయకపోవడంతో దిగుబడి తగ్గిపోయింది. పెరిగిన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే.. రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: December 4, 2019, 8:07 AM IST
సామాన్యులకు చుక్కలే.. ఉల్లి ఘాటుకు తోడు టమోటా.. ధర రెట్టింపు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓవైపు ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తుంటే.. మరోవైపు టమోటా ధర కూడా మోత మోగిపోతోంది. టమోటా ధర ఒక్కసారిగా డబుల్ కావడంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది.నిన్న మొన్నటివరకు మార్కెట్లో కిలో రూ.24 పలికిన టమోటా,ఇప్పుడు ఏకంగా రూ.50కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా టమోటా వచ్చే మదనపల్లి మార్కెట్‌లో ప్రస్తుతం టమోటా ధర రూ.48గా ఉంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట దిగుబడి తగ్గి.. మార్కెట్‌కు పంట రాకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వర్షాల కారణంగా చాలామంది రైతులు టమోటాను కోయకపోవడంతో దిగుబడి తగ్గిపోయింది. పెరిగిన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే.. రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.కొన్నాళ్ల క్రితం వరకు కనీసం రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాక ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు.ఇప్పుడు ధరలు పెరగడం హర్షనీయం అంటున్నారు.First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...