పీసిసికే దిక్కు లేనప్పుడు ఇంకా సీఎం ఎలా అవుతాడు...జానారెడ్డిపై గుత్తా ఫైర్

గుత్తా సుఖేందర్ రెడ్డి

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తలపడతున్న జానారెడ్డికి కనీసం పీసీసీని కూడ అధిష్టానం ఆఫర్ చేయలేదని, ఇంకా సీఎం ఎలా అవుతరారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు.

  • Share this:


నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తలపడతున్న జానారెడ్డికి కనీసం పీసీసీని కూడ అధిష్టానం ఆఫర్ చేయలేదని, ఇంకా సీఎం ఎలా అవుతరారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జానారెడ్డి సీఎం పదవిని త్యాగం చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం హస్యస్పదమని ఆయన అన్నారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవపట్టించింది జానారెడ్డి అని ఆయన విమర్శించారు. కాగ వైఎస్ మృతి చెందిన తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి తోపాటు రోశయ్య పేర్లు సీఎంగా ప్రస్థావనకు వచ్చాయని , కనీసం జానారెడ్డి పేరు కూడ ప్రస్థావన రాలేదని అన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో అందరు సీఎం అభ్యర్థులే అయ్యారని ఆయన ఎద్దెవా చేశారు. మరోవైపు దివంగత నోముల నర్సింహయ్యకు అన్యాయం జరిగిందని అనే జనారెడ్డి మాటల్లో అర్థం లేదని అన్నారు. ఇక జానారెడ్డి గెలిస్తే పీసీసీ అవుతారనే ప్రచారంతోనే..ఆయన ప్రత్యర్థులు జానారెడ్డి ఓటమికి కుట్రలు చేస్తున్నారని అయన వివరించారు. కాగా తెలంగాణ ఉధ్యమంలో సీఎం అవకాశాన్ని జానారెడ్డి వదులుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే...

విషయం తెలిసిందే...
Published by:yveerash yveerash
First published: