Home /News /telangana /

Registration charges: తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు.. నేటి నుంచే కొత్త ధరల అమలు..

Registration charges: తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు.. నేటి నుంచే కొత్త ధరల అమలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతం వరకు పెంచారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల మార్కెట్‌ విలువను గరిష్ఠంగా 50 శాతం, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల విలువను గరిష్ఠంగా 30 శాతం పెంచారు.

ఇంకా చదవండి ...
  తెలంగాణలో పెరిగిన భూముల విలువ, కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వ్యవసాయేతర భూములు, స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల కొత్త విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో మార్పులను బుధవారం రాత్రి ఏడుగంటలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణలోని 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరిగిన విలువలు, ఛార్జీ ప్రాతిపదికగ రిజిస్ట్రేషన్ చేసే కార్డ్ సాప్ట్ వేర్‌లో మార్పులు చేర్పులు చేశారు. మొదటి రోజు నుంచీ ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు అదనపు మొత్తం చెల్లించేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


  రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతం వరకు పెంచారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల మార్కెట్‌ విలువను గరిష్ఠంగా 50 శాతం, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల విలువను గరిష్ఠంగా 30 శాతం పెంచారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తమిళనాడులో 11 శాతం, కేరళలో 10 శాతం, ఆంధప్రదేశ్‌లో 7.5 శాతం ఉన్నాయి. ప్రభుత్వం వివిధ సంప్రదింపులు, పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 7.5 శాతంగా నిర్ణయించించింది. ఇవాళ్టి నుంచే కొత్త ధరలు, చార్జీలు అమల్లోకి వచ్చాయి.

  గతంలో రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతంగా ఉండేవి. అందులో స్టాంపు డ్యూటీ 4 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉండేది. ఇప్పుడా చార్జీలను 7.5శాతానికి పెంచారు. ఇందులో స్టాంపు డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉంది. గ్రామ పంచాయతీల పరిధిలో ట్రాన్స్‌ఫర్ డ్యూటీ లేకున్నా... రిజిస్ట్రేషన్ ఫీజు 2శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు 7.5శాతమే ఉంటుంది. గతంలో బదిలీ పన్నును ఆయా గ్రామ పంచాయతీ ఖాజానాకు సమకూరేది. కానీ ఇప్పుడు బదిలీ పన్ను తొలగించి.. దానిని రిజిస్ట్రేషన్ చార్జీల్లోనే కలిపేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీల ఆదాయమంతా నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరనుంది. ఇక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ చదరపు అడుగు కనీస ధర గతంలో రూ.800 ఉండగా.. దానిని రూ.1000గి పెంచారు. ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్ల ధరలను 20 శాతం నుంచి గరిష్ఠంగా 30 శాతం వరకు పెంచారు.


  కొత్త ధరలు, ఛార్జీల రూపంలో ప్రభుత్వాకి రూ.3వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఐతే చార్జీల పెంపు ప్రభావం వారం రోజుల వరకు ఉండవచ్చని.. కొన్ని రోజుల పాటు తక్కువ రిజిస్ట్రేషన్లు నమోదవ్వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Registrations, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు