Home /News /telangana /

NON AGRICULTURE ASSETS REGISTRATIONS WILL BE DONE IN OLD METHOD ONLY SAYS CM KCR SK

CM KCR: గుడ్‌న్యూస్.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్ (ఫైల్ పోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ పోటో)

CM KCR: హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా ? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతానికైతే పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని అధికారులతో చర్చల.. అనంతరం సీఎం నిర్ణయించారు.

ఇంకా చదవండి ...
    వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్త పద్దతిలో చేస్తున్న స్లాట్ బుకింగ్స్‌ను నిలిపివేశారు. ఈ క్షణం నుంచి స్లాట్ బుకింగ్స్ నిలిచిపోయాయి. ఇక సోమవారం నుంచి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.  కార్డు ( C.A.R.D) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ఐతే ఇప్పటికే స్లాట్ బుకింగ్స్ చేసుకున్న వారికి.. కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లతో పాటు ప్రజలు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఇక సోమవారం నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఊపందుకునే అవకాశముంది.

    కోర్టు కేసుల వలన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు కొన్ని రోజులుగా ఇబ్బందులు తలెత్తాయి. ఆధార్ కాలమ్‌ను తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని, కులం, కుటుంబసభ్యుల వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


    వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమయి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ ఆదేశించారు.

    ఐతే ఆధార్ కార్డుతో పాటు పలు అంశాలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం డైలామాలో పడింది. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లుతో పాటు ప్రజలు కూడా ఆందోళనలు చేయడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా ? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతానికైతే పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని అధికారులతో చర్చల.. అనంతరం సీఎం నిర్ణయించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Dharani Portal, Telangana

    తదుపరి వార్తలు