హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka: అప్పట్లో టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్.. ఇదీ దుబ్బాక చరిత్ర

Dubbaka: అప్పట్లో టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్.. ఇదీ దుబ్బాక చరిత్ర

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: దుబ్బాకలో ఒకప్పుడు హవా కొనసాగించిన పార్టీలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి.

  దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. దుబ్బాక నియోజకవర్గం అనగానే గతంలో టీడీపీ గుర్తొచ్చేది. టీడీపీకి కంచుకోటగా పేరుగాంచిన నియోజకవర్గంలోని వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి దశలో తీసుకెళ్లారు మాజీమంత్రి, దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డి. 1989లో తొలిసారిగా టిడిపి తరఫున ఘన విజయం సాధించిన చెరుకు ముత్యంరెడ్డి1994, 1999 వరకు టీడీపీ పార్టీ మూడు సార్లు ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత దుబ్బాకలో గులాబీ పార్టీ జోరు మొదలైంది.

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దుబ్బాక నియోజకవర్గం నుండి రెండుసార్లు టిఆర్ఎస్ ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు సోలిపేట రామలింగారెడ్డి. ఆయన మరణం తర్వాత జరగబోయే ఈ ఉపఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్‌తో సహా ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ, బిజెపి టిడిపి పార్టీలు తో ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతున్నా.. దుబ్బాకలో మాత్రం ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ తరపున ఇల్లెందుల రమేష్ ఎన్నికల బరిలో దిగుతున్నారు.

  రేపటి నుంచి నామినేషన్లు

  దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. అధికార టీఆర్ఎస్ తరపున రామలింగ రెడ్డి సతీమణి సుజాత బరిలో ఉండగా.. కాంగ్రెస్ తరపున చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున రఘునందన్ రావు పోటీ చేస్తుండగా.. టీడీపీ తరపున ఇల్లెందుల రమేష్ బరిలో నిలిచారు. సీపీఐ, సీపీఎం పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయనే అంశం తెలియాల్సి ఉంది.

  టెన్షన్ పెడుతున్న ఇండిపెండెంట్లు

  దుబ్బాక నియోజక వర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాంకర్ కత్తి కార్తీక.. గత 15 రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మరికొందరు అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది. 2018 సార్వత్రిక ఎన్నికలలో 14 మంది బరిలో ఉండగా.. జరగబోయే ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సిద్ధిపేట, గజ్వేల్ తరహాలో అధికార పార్టీ దుబ్బాకను అభివృద్ధి చేయలేదనే వాదనను ఇండిపెండెంట్లు ఎక్కువగా తెరపైకి తీసుకొస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు