ఆ పంట వేస్తే రైతు బంధు ఇవ్వం.. తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్..

ఖరీఫ్‌లో మక్క పంట వేయొద్దని, కాదని సాగు చేస్తే రైతు బంధు ఇవ్వబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: May 19, 2020, 6:42 AM IST
ఆ పంట వేస్తే రైతు బంధు ఇవ్వం.. తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఖరీఫ్‌లో మక్క పంట వేయొద్దని, కాదని సాగు చేస్తే రైతు బంధు ఇవ్వబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వానాకాలంలో మొక్కజొన్న వేయకూడదని రైతులను కోరిన సీఎం.. వరి పంట కూడా ప్రభుత్వం చెప్పిన వంగడాలే సాగు చేయాలని అన్నారు. ప్రభుత్వం చెప్పిన వంగడాలు సాగు చేస్తేనే రైతు బంధు సాయం ఇస్తామని స్పష్టం చేశారు. ఏ రైతు ఏ పంట వేస్తున్నాడన్న సమాచారం సేకరించిన తర్వాతే రైతు బంధు నిధులను ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన సీఎం.. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని, రాష్ట్రాన్ని అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ‘నెల రోజులుగా పరిశోధనలు, సమీక్షలు నిర్వహిస్తున్నాం. శాస్త్రవేత్తలు, రైస్‌ మిల్లర్లు, అధికారులు, నిపుణులతో మాట్లాడాం. నియంత్రిత వ్యవసాయాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. ఇష్టం వచ్చిన పంటలు వేసి రైతులు ఇబ్బంది పడొద్దు. డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలి. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి సామెతను మార్చాలి. రైతుల తలరాతను రైతులే మార్చుకోవాలి. అప్పుల్లేని రైతులు కావాలి. సొంత పెట్టుబడితో సాగు చేయాలి. రైతులను పైకి తేవడానికే ప్రభుత్వం తపన పడుతోంది. సూచనలు తప్పనిసరిగా పాటించాలి’ అని సీఎం వ్యాఖ్యానించారు.

అయితే, నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లో రైతులు ఎప్పటిలాగే పసుపు సాగు చేసుకోవచ్చని అన్నారు. మామిడి, బత్తాయి, ఇతర పండ్ల తోటల విస్తీర్ణం యథావిధిగా కొనసాగించుకోవచ్చని కేసీఆర్ చెప్పారు. కందులను వానాకాలంలో 15 లక్షల ఎకరాల్లో సాగు చేసుకోవచ్చని మొత్తం ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటుందని ప్రకటించారు. మక్క పంటను మాత్రం యాసంగిలోనే వేసుకోవాలని సీఎం సూచించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 19, 2020, 6:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading