హోమ్ /వార్తలు /తెలంగాణ /

cm kcr : ఆ రైతులకు రైతు భీమా, రైతు బంధులు రద్దు.. గంజాయి సాగుపై సీఎం కీలక నిర్ణయం

cm kcr : ఆ రైతులకు రైతు భీమా, రైతు బంధులు రద్దు.. గంజాయి సాగుపై సీఎం కీలక నిర్ణయం

సమీక్షలో సీఎం కేసీఆర్

సమీక్షలో సీఎం కేసీఆర్

CM KCR : గంజాయి ( Ganjai ) సాగుతో పాటు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ( cm kcr ) అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే కీలక నిర్ణయం వెలువరించారు. రాష్ట్రంలో గంజాయి సాగు చేసే రైతులకు రైతు భీమా, రైతు బంధు ( Rythu Bandhu and Bheema ) పథకాలను రద్దు చేయాలని ఆయన నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

  రాష్ట్రంలో గంజాయి ( Ganjai ) లభ్యత పెరిగినట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో.. పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ( kcr ) అధికారులను ఆదేశించారు.ఈ సంధర్భంగా రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  ఈ క్రమంలోనే  గంజాయి సాగు చేస్తే.. వారి పట్టాలను కూడా రద్దు ( cancil )చేస్తామని స్పష్టం చేశారు. గంజాయిపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్న సీఎం.. పరిస్థితి తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాలని అన్నారు. గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి తగిన ప్రణాళికను సిద్దం చేయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి ( Ganjai ) లభ్యత పెరిగినట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో.. పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ( kcr ) అధికారులను ఆదేశించారు.

  ఈ సంధర్భంగా రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ క్రమంలోనే

  గంజాయిపై సీరియస్‌గా వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలన్నారు.

  అలాగే పాఠ్యపుస్తకాల్లో డ్రగ్స్ ప్రమాదాలపై పాఠాలు ( lessons )పెట్టాలన్నారు. బార్డర్ల వద్ద చెక్ పోస్టుల సంఖ్య పెంచడం, సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అటు గంజాయిని నిరోధించడానికి డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటలిజెన్స్ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు, మొదలైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

  ఇది చదవండి : టీడీపీ నేత పట్టాభి అరెస్ట్‌.. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు


  దీంతో పాటు రాష్ట్రంలో గంజాయి లభ్యత పెరిగినట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో.. పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా  ఆంధ్రా – ఒడిషా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో ఈ గంజాయి ఉత్పత్తి జరుగుతున్నదని అక్కడి నుంచి చింతూరు -  భద్రాచలం మీదుగా మన రాష్ట్రంలోకి ప్రవేశించి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీన్ని అరికట్టేందుకు  ఇతర రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరం ఉందని వారు పేర్కొన్నారు.  రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నదని ఛత్తీస్ గఢ్ లో సైతం గంజాయి సాగు, సరఫరా జరుగుతున్నదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

  ఇది చదవండి : ఇంట్లో ఎవరు లేరని ప్రియుడిని పిలిపించుకుంది.. తమ్ముడు చూశాడని .. దారణం చేసింది.


  ఇక గంజాయిని వినియోగిస్తున్న వారిలో వలస కూలీలు, యువకులు ఎక్కువగా ఉన్నారని,  ఆటో డ్రైవర్లు, హమాలీలు కూడా ఉన్నట్లు వారు సీఎంకు వివరించారు. గంజాయి నిర్మూలనపై బలంగా దృష్టి కేంద్రీకరిస్తే, అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రంలో దీని పీడ విరగడ చేయవచ్చని, అందుకోసం కావాల్సిన సూచనలను అధికారులు తెలియజేశారు. ఎక్సైజ్, పోలీసుశాఖలతోపాటు అటవీశాఖ చెక్ పోస్టుల్లో సైతం నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని సమావేశంలో చర్చించారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: CM KCR, Telangana News

  ఉత్తమ కథలు