Home /News /telangana /

NO PASSENGERS IN HYDERABAD CITY BUSES VB

TSRTC: హైదరాబాద్ రోడ్లపై ఖాళీ బస్సులు.. నష్టాల్లో తెలంగాణ ఆర్టీసీ.. విపరీతంగా తగ్గిన ఆదాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSRTC: కరోనా మహమ్మారి ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒకప్పడు బస్సుల్లో కూర్చొడానికి సీట్లు లేకుండా ఉండగా ప్రస్తుతం ఎక్కడ చూసిన ఖాళీ సీట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో తెలంగాణ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంకా చదవండి ...
    అసలే నష్టాల్లో నడుస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ మరింత దెబ్బతీసింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వారు సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నారు. కొంత మంది ఉద్యోగ రీత్యా వెళ్లేవారు మాత్రమే ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో అత్యధిక మంది సొంత వాహనాల్లో ప్రయాణానికే ఇష్టపడుతున్నారు. దీని వల్ల ఆర్టీసీ మరింత నష్టాల్లోకి వెళ్లింది. గత రెండు వారాల నుంచి బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో అధికారులు పలు రూట్లలో బస్సులను తగ్గించేశారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో 2,800 బస్సులుండగా వాటిలో 40 శాతం బస్సులను మాత్రమే నడుపుతున్నారు. అందులో కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఎంతో కొంత ప్రయాణికులు ఉంటున్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 2021 జనవరి నెలలో రోజుకు సమారు 20 లక్షల మంది ప్రయాణం సాగించేవారు. కానీ ఇప్పుడు 7 లక్షల మంది కూడా ప్రయాణించడం లేదు. కరోనాతో ప్రజలు ఆందోళనకు గురవుతుండటం.. అంతేకాకుండా కర్ఫ్యూ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు బస్సులు డిపోలకు పరిమితం అవుతుండటంతో ఈ పరిస్థతి నెలకొందని అధికారులు తెలిపారు.

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం టికెట్ల ద్వారా రోజుకు 3.5 కోట్ల వరకు ఆదాయం ఉండగా ప్రస్తుతం ఘోరంగా రూ.70 లక్షలకు పడిపోయిందని అధికారులు తెలిపారు. 2020 డిసెంబర్ నుంచి షాపింగ్ మాల్స్, సినిమా థియోటర్స్ తెరుచుకోవడంతో బస్సుల్లో ప్రయాణం పెరిగిందని.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎవరూ ఆర్టీసీలో ప్రయాణించడం లేదని తెలిపారు. మొత్తం గ్రేటర్ జోన్ లో 29 డిపోలు ఉండగా ఆర్టీసీ సింబ్బందిని ఆయా డిపోల పరిధిలో సిబ్బందితో కోవిడ్ గ్రూప్ లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ బారిన పడిన సిబ్బందికి అండగా నిలుస్తూ, వారికి చేయూతనందిస్తున్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో అందులో 9 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి మొదటి డోస్ వేయించినట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

    మొదట్లో కేవలం 25 శాతం సర్వీసులనే నగరంలో ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ... కరోనా పరిస్థితిని బట్టి సర్వీసుల సంఖ్యను పెంచుతామని తెలిపింది.
    ప్రతీకాత్మక చిత్రం


    APSRTC vs TSRTC, tsrtc vs apsrtc, apsrtc ticket booking, tsrtc ticket booking, apsrtc latest news, tsrtc latest news, ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య యుద్ధం, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ వార్, హైదరాబాద్ రూట్‌లోనే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు, APSRTC only Vijayawada Hyderabad route
    ప్రతీకాత్మక చిత్రం


    Tsrtc, rtc buses in hyderabad, tsrtc buses in hyderabad, special buses for employees in hyderabad, cm kcr, telangana news, టీఎస్‌ఆర్‌టీసీ, హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులు, సీఎం కేసీఆర్, తెలంగాణ న్యూస్, ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు
    ప్రతీకాత్మక చిత్రం


    ప్రతీకాత్మక చిత్రం


    మిగిలిన సిబ్బందికి కూడా వ్యాక్సిన్‌ వేసేందుకు అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. ఏదేమైనా కరోనా మహమ్మారి చాపకింద నీరులా ప్రతీ రంగాన్ని కదిలిస్తుంది. చాలామంది ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కొన్ని సంస్థలు మూతపడే స్థితికి వచ్చాయి. వాటిలో భాగంగానే ఆర్టీసీకి కూడా కరోనా తాకిడి తగిలింది. అసలే నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తీసింది.
    Published by:Veera Babu
    First published:

    Tags: City buses, Decreased income, Due to corona, Greater hyderabad, Hyderabad, Secunderabad, Tsrtc, Tsrtc loses

    తదుపరి వార్తలు