Bandi Sanjay: కొట్లాడి సాధించుకుందాం.. శ్రీనివాస్ మృతిపై బండి సంజయ్

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

ఇటీవల హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీనివాస్ మరణం తననెంతో బాధించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    ఇటీవల హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీనివాస్ మరణం తననెంతో బాధించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. గురువారం రాత్రి శ్రీనివాస్ మరణించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై బండి సంజయ్ స్పందిస్తూ... ‘తమ్ముడు శ్రీనివాస్ మరణం నన్నెంతగానో భాధిస్తున్నది. మెరుగైన చికిత్స అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ ను కాపాడుకోలేకపోయాం.
    ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణాలో నీదే చివరి బలిదానం కావాలి. ప్రాణాలు ఎంతో విలువైనవి. కార్యకర్తలెవరూ ఆత్మహత్యలు పాల్పడవద్దు’ అని ఆయన అన్నారు.

    ఇంకా ఆయన స్పందిస్తూ.. ఆత్మహత్యలు తల్లితండ్రులకు కడుపుకోత తప్ప వాటి ద్వారా దేన్ని సాధించలేమని తెలిపారు. 2023 లో గోల్కొండ ఖిల్లా పై కాషాయ జెండా ఎగరడాన్ని కళ్లారా చూడడమే మన లక్ష్యం కావాలని సూచించారు. దాని కోసం బ్రతికుండి పోరాటం చేయడమే మార్గంగా ముందుకు సాగాలని కోరారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణను నిర్మాణం చేద్దామంటూ పిలుపునిచ్చారు.

    కొట్లాడే శక్తి అందరి రక్తంలో ఉందని.. కార్యకర్తలందరికీ తాను అండగా ఉంటానని అన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించిన ఆయన.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఇతర బీజేపీ నాయకులతో కలిసి ఆయన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంలో జరిగే శ్రీనివాస్ అంతిమయాత్రలో పాల్గొననున్నారు.

    కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ పార్టీ ఆఫీసు ఎదుటే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ‘అన్నా.. బండి సంజయ్ అంటే నాకు ప్రాణం. నా గుండె కోసిస్తా. పార్టీ కోసం ప్రాణమిస్తా’అంటూ శ్రీనివాస్ చేసిన కామెంట్స్‌ను పలు టీవీ చానల్స్ ప్రసారం చేశాయి.  పెట్రోల్ పోసుకున్న ఆయనను ముందు ఉస్మానియాలో చేర్చగా.. తర్వాత ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.
    Published by:Srinivas Munigala
    First published: