ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త మునిసిపల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా.. ఇంటి అనుమతులు సులభంగా మంజూరు కానున్నాయి.

news18-telugu
Updated: January 17, 2020, 7:40 AM IST
ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త మునిసిపల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా.. ఇంటి అనుమతులు సులభంగా మంజూరు కానున్నాయి. 75 గజాల్లోపు స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకోనక్కర్లేదు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించి కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే.. ఇల్లు నిర్మించుకునే సదుపాయం ఉంది. ఇల్లు కట్టాక మునిసిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందాల్సిన అవసరం లేదు. 64 చదరపు అడుగులు నుంచి 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో పది మీటర్ల ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే.. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే వెంటనే అనుమతులు వస్తాయి.

అటు.. 200 చదరపు అడుగుల లోపు లేదా 7 మీటర్ల లోపు భవనాలను కట్టేవారు 10శాతం బిల్డప్ ఏరియాను కూడా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పుడు వివరాలు నమోదు చేస్తే నోటీసులు ఇవ్వకుండానే ఇల్లును కూల్చేస్తారు. ఇదిలా ఉండగా, 500 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ, 10 మీటర్ల లేదా అధిక ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వాళ్లు ఆన్‌లైన్‌లో 21 రోజుల్లోనే అనుమతి పొందవచ్చు. అయితే.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మిస్తే మూడేళ్ళ జైలు, భారీ జరిమానా తప్పదని చట్టం చెబుతోంది.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు