హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కరోనాతో కలిసి జీవించాల్సిందే.. పుకార్లు నమ్మొద్దన్న మంత్రి ఈటల

Telangana: కరోనాతో కలిసి జీవించాల్సిందే.. పుకార్లు నమ్మొద్దన్న మంత్రి ఈటల

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. అక్కడ కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్, బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. అక్కడ కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్, బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

Telangana: ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.

  తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల సమావేశమయ్యారు. ఈ విషయానికి సంబంధించి వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దన్నారు. సాధారణ జీవితం కొనసాగించాల్సిందేనని అందరం కరోనాతో జీవించాల్సిందేనని మంత్రి అన్నారు. ప్రతి ఇల్లు ఔషధాలయంగా పనిచేయాలని అన్నారు. కరోనా విషయంలో గతంలో ఉన్నంత భయం ప్రజల్లో ఇప్పుడు లేదని.. అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, మహారాష్ట్రలో కేసులు పెరిగాయన్న ఈటల... హైదరాబాద్‌కు ప్రతి రోజు వేలాది మంది వస్తూ పోతుంటారని అన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

  కేసుల సంఖ్య పెరిగినా, వైరస్‌ తీవ్రత తక్కువగా ఉందని వెల్లడించారు. స్వీయ నియంత్రణ, పరిశుభ్రత, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కొవిడ్‌ చికిత్సకు పడకల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, ఫీజుల వసూళ్లపై ప్రైవేటు యాజమాన్యాలతో చర్చించినట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా మాస్క్ పెట్టుకుంటే అది లాక్‌డౌన్ కంటే ఎక్కువగా కరోనా కట్టడికి తోడ్పడుతుందని తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Etela rajender, Telangana

  ఉత్తమ కథలు