పెద్దపల్లి జిల్లాలో సింహం సంచరిస్తోందా? అతను చూసింది సింహమేనా?

ఇన్నాళ్లూ తెలంగాణ అడవుల్లో పులులు, చిరుతలు మాత్రమే సంచరించిన వీడియోలు చూశాం. ఇప్పుడు ఓ సింహం సంచరిస్తున్న వీడియో కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: September 22, 2020, 10:05 AM IST
పెద్దపల్లి జిల్లాలో సింహం సంచరిస్తోందా? అతను చూసింది సింహమేనా?
పెద్దపల్లి జిల్లాలో సింహం సంచరిస్తోందా? (credit - twitter)
  • Share this:
తెలంగాణ... పెద్దపల్లి జిల్లా... కమాన్ పూర్ మండలం... గుండారం అడవి శివారు ప్రాంతంలో సింహం తిరుగుతోందనీ... దాన్ని వీడియో తీశాననీ, ఆ వీడియోను ఫారెస్ట్, పోలీస్, ఇతర అధికారులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు వెంటన అక్కడికి వెళ్లి... సింహం కోసం గాలించారు. అంతా పరిశీలించారు. ఎక్కడా సింహం కనిపించలేదు. సింహం కాలి ముద్రలు కూడా లేవు. చివరకు ఇదో నకిలీ వీడియో అని అధికారులు తేల్చారు. ఇలాంటివి ప్రజలు నమ్మవద్దనీ... సింహం లేదని స్పష్టత ఇచ్చారు. సింహం లేకపోతే... మరి ఆ వీడియో ఏంటి? అది ఎక్కడిది అన్న ప్రశ్నలకు కూడా అధికారులు సమాధానం ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లో సంవత్సరం కిందట జరిగిన ఘటనకి సంబంధించిన వీడియోని డౌన్‌లోడ్ చేసి, దాన్ని మళ్లీ ఇప్పుడు పోస్ట్ చేసి... ప్రజలను తప్పుడు సమాచారంతో భయపెడుతున్నట్లు అధికారులు తేల్చారు. ఈ రోజుల్లో ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టిన వారిని కనిపెట్టడం క్షణాల్లో పని. దీనిపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ప్రజలు మాత్రం ఏ సింహమూ లేదనీ... ఎలాంటి టెన్షనూ పడొద్దని కోరారు.


ఇది నకిలీ వీడియో అయినప్పటికీ... ఈమధ్య తెలంగాణలో ఇలాంటి వన్య మృగాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో ఇలాంటి సందర్భాలుంటున్నాయి. తెలంగాణలో ఆరేళ్లుగా జరుపుతున్న హరితహారం, వరుసగా కురుస్తున్న భారీ వర్షాల వంటివి... అడవులు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. అందువల్ల వన్యమృగాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో... అప్పుడప్పుడూ అవి ప్రజలు ఉండే నివాస ప్రాంతాలవైపు వస్తున్నాయి. అందువల్ల అడవులకు దగ్గరగా ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిదే.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 10:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading