news18
Updated: January 1, 2021, 8:44 PM IST
వాహనదారులకు సూచనలిస్తున్న పోలీసులు
- News18
- Last Updated:
January 1, 2021, 8:44 PM IST
కొత్త సంవత్సరంలో ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రవాణా శాఖ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. నేటి నుండి ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. అదే నో హెల్మెట్ నో పెట్రోల్ పథకం. ద్విచక్ర వాహనదారులు హెల్మట్ ధరించ కుండా తప్పించుకుంటుండటం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు పెట్రోలు బంక్ యజమానులతో మాట్లాడి ఒప్పించారు. మండలాల వారిగా అధికారులు ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. గతంలో 2016 లో కూడా ఈ నిర్ణయాన్ని కొంతకాలం అమలుచేసినప్పటికి ఎక్కువ కాలం కొనసాగలేదు.
కాగా.. దీనిని తిరిగి ఈ యేడాది అమలులోకి తీసుకువచ్చారు. 2016 సంవత్సరంలో జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ ఉండటం వల్ల తక్కున నష్టం జరిగినట్లు తేలిందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వివిధ ప్రభుత్వం శాఖల సమన్వయంతో ఒకపక్క ఈ నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని పకడ్భందిగా అమలుచేస్తూన్నే మరోవైపు ప్రమాదాల నివారణ, భద్రత కోసం కార్యక్రమాలను కొనసాగిస్తుంటామని ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖ ఉప కమీషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ పేర్కొన్నారు. సరికొత్తగా అమలులోకి తెచ్చిన ఈ పథకం ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో వేచిచూడాలి.
Published by:
Srinivas Munigala
First published:
January 1, 2021, 5:48 PM IST