4 రోజుల తర్వాత శుభకార్యాలు లేవ్... 3 నెలల వరకూ అంతే...

Muhurtham : సైన్స్‌ని నమ్మే మనం... శుభకార్యాలకు... పండితులు చెప్పినట్లు చేస్తాం. వారు చెప్పే ముహూర్తాల్ని పాటిస్తాం. ఈ నెల 27 తర్వాత ఇక సుముహూర్తాలు లేవని చెప్పేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 23, 2019, 8:37 AM IST
4 రోజుల తర్వాత శుభకార్యాలు లేవ్... 3 నెలల వరకూ అంతే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకునేవారికి ముగిలింది 4 రోజులే. ఈ నెల 27 చివరి తేదీ. ఆలోగా ఏ శుభకార్యాలు ఉన్నా చేసేసుకోవాలి. ఆ తర్వాత శుక్ర మూఢమి మొదలవుతుంది. ఫలితంగా మూడు నెలలపాటూ గృహప్రవేశాలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలేవీ చేసుకోకూడదట. ఈ విషయం తెలిసిన చాలా మంది ఇప్పటికే... శుభకార్యాల్లో తలమునకలై ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ ఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఎండల వల్ల శుభకార్యాల్ని వాయిదా వేసుకున్నా... ఇప్పుడు వాతావరణం చల్లబడటంతో... ఈ నాలుగు రోజుల్లో చాలా కార్యక్రమాలు జరిగిపోయేలా ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. ఇటు ప్రజలు, అటు పురోహితులు, పండితులు, జ్యోతిష్యులు, స్వాములు అందరూ బిజీ అయిపోయారు.

ఈనెల 23, 25, 26, 27 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయిు. అవి మిస్సైతే... ఇక అంతే. అక్టోబర్ 2 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. అప్పటికి గానీ మూఢమి ముగియదు. ఈ మధ్యలో కార్యక్రమాలు చేసుకుంటే ఏమవుతుంది? కొంపలు మునిగిపోతాయా... అని అడిగేవాళ్లూ ఉంటారు. ఏదో అవుతుందని కాదు... మనం సమాజంలో ఉన్నప్పుడు... కొన్ని ఆచారాలు, సంప్రదాయాలూ ఉంటాయి. వాటిని అందరూ పాటిస్తే అందరికీ మంచిదే అంటున్నారు పండితులు. గ్రహాలు, రాసులు, నక్షత్రాలు, తిథులు, రాహు కాలాలు, వర్జ్యాలు ఇలా ఎన్నింటినో లెక్కలోకి తీసుకొని మంచి ముహూర్తాలు ఫిక్స్ చేస్తామంటున్న పూజారులు... మూఢమి కాలంలో కంటే... మూఢమి ముందో, ముగిసిన తర్వాతో శుభకార్యాలు చేసుకుంటే మంచిదంటున్నారు.

మామూలుగా ఆషాడ మాసమైన జులైలో ఏ కార్యక్రమాలూ పెట్టుకోరు. ఆగస్టు శ్రావణ మాసం కాబట్టి శుభకార్యాలు జరుపుకునేవారు. ఈసారి మూఢమి వల్ల ఆ ఛాన్స్ లేదు. సెప్టెంబర్ భాద్రపద మాసం కాబట్టి... అది శూన్యమాసంగా ఉంటుంది. అప్పుడు కూడా ముహూర్తాలు లేవు. అందువల్ల అక్టోబర్ 2 దాకా ఆగాలంటున్నారు.

బిజినెస్ గండి కొట్టినట్లే : ఏ వారమో, మహా అయితే నెల రోజులో ముహూర్తాలు లేవంటే సరే అనుకోవచ్చు. కానీ మూడు నెలలు శుభకార్యాలు ఆగిపోతే పూజారుల పరిస్థితేంటి? వారితోపాటూ పూల వ్యాపారులు, కేటరింగ్ వారు, షామియానా, ఈవెంట్ మేనేజ్‌మెంట్లు ఇలా ఎవరికీ బిజినెస్ ఉండదు. కళ్యాణ మండపాలకూ మెయింటెనెన్స్ భారం తప్పదు. అయినప్పటికీ ముహూర్తాల్ని ఫాలో అవ్వడమే మంచిదంటున్నారు అందరూ.

ప్రస్తుతానికి షాపింగ్ మాళ్లు బిజీగా ఉన్నాయి. అన్ని సిటీల్లో వస్త్ర, గోల్డెన్ షాపులు కిక్కిరిసిపోతున్నాయి. మండపాల నిర్వాహకులు, పురోహితులు ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు ముఖ్యంగా శ్రీశైలం, మహానందిలో వివాహాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి :

ఎకనమిక్ పాలసీపై ప్రధాని మోదీ దృష్టి - ఆర్థికవేత్తల సలహాలు స్వీకరణ

చైనాలో తగ్గుతున్న జనాభా సంఖ్య... 8 ఏళ్లలో చైనాను వెనక్కి నెట్టబోతున్న ఇండియా...


వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?... పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్...

2022లో జమిలి ఎన్నికలు... ఏపీలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా?
Published by: Krishna Kumar N
First published: June 23, 2019, 8:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading