Home /News /telangana /

NIZAMABAD YOUNG WOMAN IS LIVING IN A TOILET AFTER HER HOUSE COLLAPSED IN KAMAREDDY DISTRICT SNR NZB

Telangana : భర్తను వదిలేసి 3ఏళ్లుగా బాత్రూంలోనే ఉంటున్న యువతి .. జరిగిందేంటో తెలిస్తే షాక్ అవుతారు

bathroom house

bathroom house

Telangana: మనిషికి తప్పక అవసరమైన వాటిలో ముఖ్యమైనవి మూడే మూడు. కూడు, గూడు,గుడ్డ. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా వాళ్ల జీవితం ఎంత దుర్బరంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కామారెడ్డి జిల్లాలో ఓ అనాథ యువతి గూడు చెదిరిపోవడంతో చివరకు ఎక్కడ తలదాచుకుంటుందో తెలుసా.

ఇంకా చదవండి ...
  (P.Mahendar,News18,Nizamabad)
  దైవం చిన్న చూపు చూడడంతో  చిన్న త‌నంలోనే తండ్రిని కోల్పోయింది. పెద్ద‌య్యాక ఆనారోగ్యంలో త‌ల్లి కూడా కాలం చేయాడంతో ఒంట‌రిగా మిగిలిపోయింది. గ్రామ‌స్తులంతా కలిసి ఓ తోడు వెదికి పెడితే ఆ బంధం మధ్యలోనే తెగిపోయింది. ఇన్ని కష్టాల్ని భరిస్తూ వస్తున్న ఆ ఒంటరి యువతిని చివరకు విధి కూడా వెక్కిరించింది. ఫలితంగా ఉండేందుకు గూడు కూడా లేకపోవడంతో (Bathroom)నే భవంతిగా మార్చుకొని దయనీయ జీవితాన్ని వెళ్లదీస్తోంది. ఇంతటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తనకు ప్రభుత్వం(Government)ఏదో విధంగా సాయం చేయమని కోరుతోంది కామారెడ్డి(Kamareddy)జిల్లాకు చెందిన పోసాని(Posani).

  Nalgonda : వివాహిత మృతితో పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత .. కారణమైన అతడ్ని వదలద్దంటున్న బంధువులు  వెంటాడుతున్న కష్టాలు..
  కామారెడ్డి జిల్లా దోమ‌కొండ మండ‌లం ఫ‌రీద్‌పేట్‌కు చెందిన క‌ర్రోళ్ల ఎల్ల‌య్య‌, ఎల్ల‌వ్వ దంప‌తులకు ఒక్కగానొక్క కూతురు పోసాని. 23సంవత్సరాల యువతికి ఊహ తెలియని వయసులోనే తండ్రి క‌ర్రోళ్ల ఎల్ల‌య్య కన్నుమూశాడు. తండ్రి లేకపోయినప్పటికి తల్లి ఎల్ల‌వ్వ అన్నీ తానై పోసానిని పెంచి పోషించింది. జీవితంలో అప్పుడే ఆనందం క్షణాలు అనుభవిస్తున్న సమయంలో పోసాని తల్లి ఎల్ల‌వ్వ ఆనారోగ్యంతో మూడేళ్ల క్రితం చనిపోయింది. దీంతో క‌న్న వారిని కోల్పోయిన పోసాని  ఒంట‌రిగా మారింది. అనాథగా మారడంతో కష్టాలు చుట్టుముట్టాయి. పోసాని తల్లి చనిపోయిన కొన్ని రోజులకే ఇంటున్న పూరిల్లు కూడా కూలిపోయింది. దాంతో ఓ యువతి కన్నవాళ్లు లేని అనాథగానే కాకుండా గూడు లేని పక్షిగా మారిపోయింది.  బాత్రూం ఆమె భవంతి..
  ఉంటున్న పూరిల్లు కూలిపోవడంతో ..పోసాని ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న మరుగుదొడ్డే చివరకు తలదాచుకునేందుకు ఆవాసంగా మారింది. ఇల్లు కూలి, తల్లిదండ్రులు దూరమైన ఓ ఒంటరి యువతి ఆ మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తూ వస్తోంది. విధి ఆడిన వింత నాటకంలో బలైనపోయిన పోసాని పరిస్థితి గమనించిన గ్రామస్తులు తలా కొంత డబ్బులు వేసుకొని వాడి గ్రామానికి  చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించారు. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. పెళ్లైన కొన్ని రోజులకే కొన్ని కారణాల వల్ల పోసాని భర్తకు దూరంగా ఉంటోంది. బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది.

  Hyderabad | Heavy rains:సైలెంట్‌గా కురిసిన వర్షానికి వణికిపోయిన ఓల్డ్ సిటీ ..ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు  ఆపన్నహస్తం ఇవ్వండి..
  ఇంతటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న పోసానికి భారీ వర్షాలు కూడా ప్రాణసంకటంగా మారాయి. వర్షాల కారణంగా బాత్రూం చుట్టుపక్కలకు పాములు, తేళ్లు చేరడంతో భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతోంది. ఎప్పుడు ఏ విషపురుగు కాటేస్తుందోననే భయాందోళనలో రోజులు నెట్టుకొస్తోంది యువతి. తన జీవిత పరిస్థితిని ప్రభుత్వం అర్ధం చేసుకొని పక్కా ఇంటిని నిర్మించి అదుకోవాల‌ని పోసాని వేడుకుంటోంది. మ‌న‌సున్న‌ మానవతావాదులు ముందుకొచ్చి ఆర్ధిక సాయం చేయాలని కోరుతోంది ఒంటరి యువతి.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Kamareddy, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు