Home /News /telangana /

NIZAMABAD YOUNG WOMAN AND MAN ATTEMPTED SUICIDE IN NIZAMABAD DISTRICT DUE TO FALSE RELATIONSHIP SNR NZB

Suicide attempt : మేం లవర్స్ కాదు మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ .. ఎవరూ నమ్మడం లేదని ఏం చేశారో తెలుసా

NIZAMABAD SUICIDE

NIZAMABAD SUICIDE

Suicide attempt: వాళ్లు కలిసి చదువుకుంటున్నారు. ఇద్దరూ ఒకే బస్సులో కాలేజీకి వెళ్తారు. ఎక్కడైనా కలిస్తే నవ్వుతూ పలకరించుకుంటారు. అయితే అందరూ వాళ్ల మధ్య ఏదో సంబంధం ఉందని భ్రమపడ్డారు. లేదు మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోలేదు. పదే పదే అనుమానాపు చూపులు, వేధింపు ప్రశ్నలు వేస్తూ ఉండటంతో వాళ్లు భరించలేకపోయారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India
  (P.Mahendar,News18,Nizamabad)
  వాళ్లు కలిసి చదువుకుంటున్నారు. ఇద్దరూ ఒకే బస్సులో కాలేజీకి వెళ్తారు. ఎక్కడైనా కలిస్తే నవ్వుతూ పలకరించుకుంటారు. అయితే అందరూ వాళ్ల మధ్య ఏదో సంబంధం ఉందని భ్రమపడ్డారు. లేదు మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోలేదు. పదే పదే అనుమానాపు చూపులు, వేధింపు ప్రశ్నలు వేస్తూ ఉండటంతో వాళ్లు భరించలేకపోయారు. చేయని తప్పును భరిస్తూ బ్రతకలేక ..సమాజం నోరు మూయించలేక చివరికి అంత పని చేశారు. ప్రాణపాయస్థితిలో ఉన్న మైనర్ బాలికను, యువకుడ్ని ప్రైవేట్ ఆస్పత్రి(Private hospital)కి తరలించారు.. చికిత్స పోందుతూ యువ‌కుడు(Man)మృతి చెంద‌గా.. బాలిక(Girl)కండీషన్ సీరియస్‌గా ఉంది. నిజామాబాద్(Nizamabad)జిల్లాలో ఆలాస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన.

  Telangana : కొంప ముంచిన నిద్రమత్తు .. కళ్లు మూసి తెరిచేలోపే గాల్లో కలిసిన నాలుగు ప్రాణాలు  మరణవాంగ్మూలం..
  నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం దత్తపుర్ గ్రామానికి చెందిన వినయ్ కుమార్ తోండకూర్ గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలిక ఇద్ద‌రు నిజామాబాద్ న‌గ‌రానికి చ‌దువు కొవడానికి వచ్చేపోతుండే వారు. ఇద్ద‌రూ ఒకే బ‌స్సులో రావ‌డం పోవ‌డంతో క‌లిసి క‌నిపించే వారు. ఆ విధంగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. వినయ్ కుమార్ డీఎంఎల్‌టీ చేస్తున్నాడు. బాలిక పాలిటెక్నిక్ చ‌దువుతుంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న పరిచయాన్ని సమాజం తప్పు పట్టింది. అప్పటికి వాళ్లు మాది అన్నా, చెల్లెళ్ల అనుబంధం చెబుతున్నా పట్టించుకోలేదు. లోకం చూసే చూపులను, వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మనస్తాపానికి గురయ్యారు.  మాది అన్నాచెల్లెలి సంబంధం..
  అర్ధం చేసుకోలేని మనుషుల మధ్య బ్రతకడం వేస్ట్ అనుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 8న గిరిరాజ్ కళాశాల పరిసర ప్రాంతంలో సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్ద‌రిని స్థానికులు జిల్లా ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ.. అన్న వినయ్ కుమార్ ఈ రోజు ఉద‌యం మృతి చెందాడు. చెల్లెలు చికిత్స పొందుతుంది. అయితే ఆమె పరిస్థితి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. బాధితులు రాసిన సూసైడ్ నోట్‌లో తమ మధ్య ఎలాంటి తప్పుడు సంబంధాలు లేవని.. ఇద్ద‌ర‌ం అన్న చెల్లెలుగా ఉన్నామని పేర్కొన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  Political survey : ఆ జిల్లాలో ప్రధాన పార్టీకి చెందిన ఆ ఏడుగురికి ఈసారి టికెట్ డౌటే .. తేల్చి చెప్పిన పొలిటికల్ సర్వే  మేం ఏ తప్పు చేయలేదు..
  బయటకు చెప్పుకోలని వింత సమస్య, సమాజం వేసే నిందలు భరించలేకపోతూ బాధితులు రాసిన సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే ..మేమిద్దం బ్రదర్ అండ్ సిస్టర్. కాని ఈ సమాజం మా మధ్య ఫ్యామిలీ రిలేషన్ ఉందని ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ క్రియేట్ చేస్తున్నారు. మేం ఎప్పుడూ తప్పు చేయలేదు. మేం బ్రదర్ అండ్ సిస్టర్ అలానే ఉన్నాం. మానసికంగా, శారీరకంగా ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటి మా ఇద్దరి మధ్య తప్పుడు సంబంధం క్రియేట్ చేయడాన్ని భరించలేకపోతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ ఆ విషయం అర్థం చేసుకోవడం లేదని ఆవేదనతో కూడిన అక్షరాల్ని మరణ వాంగ్మూలంగా లేఖలో పొందుపర్చారు.

  అర్ధం చేసుకోండి..
  చివరగా మేం ఏ తప్పు చేయలేదు. చేయని తప్పును ఒప్పుకోలేకే చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావుకి మేమే కారణం తప్ప మా ఫ్యామిలీలో ఏ ఒక్కరు కాదు. చివరి సారిగా చెబుతున్నాం మా మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉంది. ఎలాంటి తప్పుడు సంబంధం లేదని రాస్తూ పురుగుల మందు తాగారు. సమాజం ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకుంటే తప్పుగా అర్ధం చేసుకుంటారే తప్ప ఎందుకు అన్న చెల్లెలి అనుబంధం అనుకోరు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాతైనా మనుషుల్ని కాస్త అర్ధం చేసుకోవడానికి ...వాళ్లు చెప్పేది ఆలకించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని పోలీసులు సూచిస్తున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Attemp to suicide, Nizamabad, Telangana News

  తదుపరి వార్తలు