(P.Mahendar,News18,Nizamabad)
వన్ సైడ్ లవ్One sided loveతో కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయి ప్రేమించకపోయినా..ఇష్టం లేదని చెప్పినా అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ ముసుగులో అదే యువతులపై ఘాతుకానికి పాల్పడుతున్నారు. నిజామాబాద్Nizamabad జిల్లాలో ఓ యువకుడు యువతిని ప్రేమించమని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరచించడంతో ఏకంగా గొంతు కోసి హతమార్చేందుకు తెగబడ్డాడు. ప్రేమ పేరుతో ఉన్మాదానికి పాల్పడిన యువకుడ్ని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకునే వాళ్లను చూశాం. ప్రేమించిన యువతి కోసం ఎంత సాహసమైన చేసిన వాళ్ల గురించి విన్నాం. కాని నిజామాబాద్ జిల్లాలో మాత్రం ప్రేమించనందని యువతి ప్రాణాలే తీయడానికి ప్రయత్నించాడో ఉన్మాది.
ప్రేమోన్మాది ఘాతుకం..
నిజామాబాద్ జిల్లా మొపాల్ మండలం భాడి చిన్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి మాక్లూర్ మండలం మాణిక్ బండారుకు చెందిన సుంకరి సంజయ్ కుమార్ బంధువు అవుతాడు. దూరపు బంధువు కావడంతో యువతిని ప్రేమించమంటూ వెంటపడుతున్నాడు. రెండేళ్ల క్రితం యువతి తండ్రి చనిపోవడం, తల్లితో కలిసి ఉంటోంది. మగదిక్కు లేని ఆడవాళ్లు కావడంతో సంజయ్‌కుమార్ తనను ప్రేమించాల్సిందేనంటూ యువతిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. శుక్రవారం సంజయ్‌కుమార్ టార్చర్ పరాకాష్టకు చేరింది.
ప్రేమించనందని పీక కోశాడు..
బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సంజయ్ ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమించమంటూ యువతితో గొడవపడ్డాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో ఉన్మాదిగా మారిన సంజయ్‌కుమార్ వెంట తెచ్చుకున్న పదునైన కత్ితతో యువతి గొంతు కోశాడు. ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ యువతి ఇంట్లోంచి రోడ్డుపైకి వచ్చి అరవడంతో సంజయ్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు బాధితురాలిని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
చావుతో పోరాడుతున్న యువతి..
సంజయ్‌కుమార్ చేతిలో గాయపడ్డ యువతికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆమెకు ప్రాణపాయం లేదని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో మోపాల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు యువతికి దూరపు బంధువు కావడంతో సమాచారం తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై అంతటి ఘాతుకానికి పాల్పడటానికి కారణంపై ఆరా తీస్తున్నారు. ఫ్రెండ్స్, బంధువుల పేరుతో చనువుగా ఉండే వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అమ్మాయిలు క్యాజువల్‌గా పలకరించినా ..అబ్బాయిలు లవ్ అనుకొని ఈతరహా ఘాతుకాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఎవరిపట్ల అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇలాంటి సంఘటనలు పెద్దగా అయ్యే వరకు ఊపేక్షించడం సరికాదని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Lover, Nizamabad