టిక్ టాక్ చేస్తూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు

ఇంతలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. ఇంతలో ఒడ్డున ఉన్న కొందరు చీరలు అందించి ఇద్దర్ని కాపాడారు.

news18-telugu
Updated: September 22, 2019, 11:21 AM IST
టిక్ టాక్ చేస్తూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు
టిక్ టాక్ చేస్తూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు
  • Share this:
టిక్ టాక్ పిచ్చి కొందరి ప్రాణాలు తీస్తోంది. తాజాగా టిక్ టాక్ చేస్తూ ఓ యవకుడు చెక్ డ్యాం వరద నీటిలో కొట్టుకుపోయాడు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పలవాగు చెక్ డ్యామ్ వద్ద ఈ దుర్ఘటన చేసుకుంది. చెక్ డ్యాం వద్ద టిక్ టాక్ చేసేందుకు వాగులో దిగారు ముగ్గురు యువకులు, టిక్ టాక్ చేసిన తర్వాత చేపలు కూడా పట్టారు. ఇంతలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ముగ్గురు నీటిలో కొట్టుకుపోయారు. ఇంతలో ఒడ్డున ఉన్న కొందరు చీరలు అందించి ఇద్దర్ని కాపాడారు. కానీ వరద ఉధృతికి దినేష్ కనపించకుండా పోయాడు. దీంతో అతడి కోసం వాగులో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు, దినేష్ కుటుంబసభ్యులు, అధికారులు చెక్ డ్యాం వద్దకు చేరుకున్నారు. టిక్ టాక్ వీడియో కోసం చెక్ డ్యాం వాటర్ ఫ్లో దగ్గర నీటిలో పడుతూ దినేష్ వీడియో తీశాడు. ఆ వీడియో తీసిన కాసేపటికే అతడు కనపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న దినేష్ నెల కిందటే సొంతూరుకు వచ్చాడు. మళ్లీ అతడు దుబాయ్ వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో... తల్లిదండ్రులు ఆవేదనకు అంతేలేకుండా పోయింది. వారిని ఒదార్చడం ఎవరితరం కాలేదు.

Published by: Sulthana Begum Shaik
First published: September 22, 2019, 9:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading