NIZAMABAD YOUNG FARMER DIED OF ELECTRIC SHOCK IN KAMAREDDY DISTRICT WITHIN A MONTH OF HIS MARRIAGE SNR NZB
Kamareddy : కామారెడ్డి జిల్లాలో పెళ్లి జరిగిన నెలకే వరుడు మృతి.. ఆరేళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా
(వెంటాడిన మృత్యువు)
Kamareddy: తమను చూసుకునేందుకు ఇద్దరు కొడుకులు ఉన్నారులే అనే ధీమాను కోల్పోయారు ఆ దంపతులు. ఆరేళ్ల క్రితం పెద్దకొడుకు చనిపోతే..మిగిలిన ఒక్క కొడుకుకి నెల రోజుల క్రితం ఘనంగా పెళ్లి చేశారు. కొడుకు, కోడలు కళ్లముందే తిరుగుతుంటే మురిసిపోయిన దంపతులకు ఇంతలోనే మరో పిడుగులాంటి వార్త కృంగదీసింది.
(P.Mahendar,News18,Nizamabad)
వయసు పైబడిన తల్లిదండ్రుల ఆశలన్ని కన్నబిడ్డలపైనే ఉంటాయి. ఎందుకంటే బాధ్యతలతో పాటు తమ బాగోగులు కూడా వాళ్లే చూసుకుంటారనే నమ్మకం. కంటి చూపుతో సమానమైన ఇద్దరు బిడ్డలు కళ్ల ముందే కాలం చేస్తే ఆ వృద్ధ దంపతులు పడుతున్న క్షోభ మాటల్లో వర్ణించలేనిది. తనోకటి తలిస్తే దైవం మరోకటి తలిసింది అన్నట్లుగా ఉంది కామారెడ్డి(Kamareddy)జిల్లాకు చెందిన పెంటయ్య (Pentayya) దంపతుల పరిస్థితి. లింగంపేట(Lingampeta)మండలం శెట్పల్లి సంగారెడ్డి (Shetpalli Sangareddy)కి చెందిన కుమ్మరి పెంటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తూన్నారు. పెద్ద కుమారుడు ఆరేళ్ల క్రితం మృతి చెందగా మిగిలిన ఒక్కగానొక్క కొడుకు కూడా కరెంట్ షాక్‌తో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరునవిలపిస్తున్నారు.
వృద్ధ దంపతుల కడుపుకోత..
పెంటయ్య పెద్ద కొకుడు ఆరేళ్ల క్రితం చనిపోయాడు.ల మిగిలిన మరో కుమారుడు దత్తాత్రేయపైనే కోటి ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారు తల్లిదండ్రులు. నెల రోజుల క్రితమే దత్తాత్రేయకు మెదక్ జిల్లా ఆర్కెల గ్రామానికి చెందిన అమ్మయితో ఘనంగా వివాహం జరిపించారు. దత్తాత్రేయ ఊళ్లోనే వ్యవసాయ పనులు చూసుకుంటూ తల్లిదండ్రుల కళ్ల ముందే ఉంటున్నాడు. కరెంట్ షాక్ రూపంలో మృత్యువు అతడి ప్రాణాలు తీసుకుపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు.
పెళ్లైన నెలరోజులకే మరణం..
దత్తాత్రేయకు నాగిరెడ్డి పేట మండలం వదల్పర్తి శివారులో వ్యవసాయ భూమి ఉంది. అయితే బోరు మోటారు వద్ద విద్యుత్తు తీగలు సరిచేయడానికి మిత్రుడు బొక్కల రమేష్‌ను వెంటబెట్టుకుని పోలానికి వెళ్లాడు. విద్యుత్ తీగలను బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు దత్తాత్రేయపై పడటంతో విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్నేహితుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కొల్పోయాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. వృద్దాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో చూసిన దత్తాత్రేయ తల్లిదండ్రులు గుండెలు అవిశిపోయేలా రోధిస్తున్నారు.
శోకసంద్రంలో రెండు కుటుంబాలు..
21వ సంవత్సరాల వయసున్న దత్తాత్రేయకు నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందడంతో అటు కన్నవాళ్లు..ఇటు పిల్లనిచ్చి వివాహం చేసిన అత్తమామల ఇళ్లలో విషాదం నెలకొంది. నెలరోజుల నవవధువు భర్తను కోల్పోవడం...వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు బిడ్డ దూరమడంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. దత్తాత్రేయ తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఏకంగా 90 శాతం ఉత్తీర్ణత.. సీఎం సొంత జిల్లా సంచలన రికార్డు.. వివరాలివే
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.