(P.Mahendar,News18,Nizamabad)
మంత్రిగారి ఇంట్లో ఉండాల్సిన యువకుడు ..చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. తెలంగాణలోని నిజామాబాద్(Nizamabad)జిల్లాలో ఈఘటన కలకలం రేపింది. పాతికేళ్ల వయసున్న యువకుడు బలవన్మరణం(Suicide) చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే(love affair)కారణమని పోలీసులు(Police)తమ ప్రాధమిక విచారణలో తేల్చారు. అయితే అతని ఫోన్ వాట్సాప్ చాటింగ్(WhatsApp Chatting)చూసిన వెంటనే పోలీసులు షాక్ అయ్యారు. చనిపోయిన యువకుడి చావుకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చనే నిర్ధారణకు వచ్చారు. అయితే అసలు చనిపోయిన యువకుడి వ్యవహారంలో పోలీసులు పూర్తి వివరాలు రాబడుతున్నారు.
మంత్రి గారి పనివాడు శవమయ్యాడు..
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో దేవేందర్ అనే పాతికేళ్ల యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొద్ది రోజులుగా తెలంగాణ రోడ్డు,భవన నిర్మాణాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నాడు. దేవేందర్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే ఈవిషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
ఆ మహిళ ఎవరో ..?
చనిపోయిన యువకుడు దేవేందర్ సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తన సెల్ఫోన్లో మహిళతో చాటింగ్ చేసినట్లుగా గుర్తించారు. అయితే చాటింగ్ చేసిన మహిళను ప్రేమించాడా లేక ఆమె మోసం చేస్తే భరించలేక సూసైడ్ చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత వారం రోజులుగా దేవేందర్ తన సెల్ఫోన్లో వాట్సాప్ స్టేటస్ కూడా ఆమె ఫోటోను పెట్టుకోవడంతో డీప్ లవ్‌లో పడినట్లుగా భావిస్తున్నారు.
ప్రేమ వ్యవహారమే కారణమా..
మృతుడు దేవేందర్ శనివారంరాత్రి 11, 12 గంటల ప్రాంతంలో సదరు మహిళతో వాట్సాప్ చాటింగ్ చేసాడు. నేను వెళ్లిపోతాను...ఇకపై ప్రశాంతంగా ఉండూ అని చాటింగ్‌లో ఏసీపీ ప్రభాకర్ తెలిపారు. అయితే దేవేందర్ మృతిపై అటు పోలీసు అధికారులు మంత్రి కార్యాలయం అధికారులు ఎవరు కూడా ధ్రువీకరించడం లేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే దేవేందర్ మృతికి కారణాలు ఏమిటనే విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామని ఏసీపీ ప్రభాకర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love failure, Nizamabad, Telangana News