హోమ్ /వార్తలు /తెలంగాణ /

వీడెక్కడి మొగుడండీ బాబూ.. పెళ్లయిన మూడున్నరేళ్ల తర్వాత విచిత్ర కారణాలతో విడాకులు కోరుతున్న భర్త..!

వీడెక్కడి మొగుడండీ బాబూ.. పెళ్లయిన మూడున్నరేళ్ల తర్వాత విచిత్ర కారణాలతో విడాకులు కోరుతున్న భర్త..!

కీర్తి, వినయ్ కుమార్ (పెళ్లి నాటి చిత్రం)

కీర్తి, వినయ్ కుమార్ (పెళ్లి నాటి చిత్రం)

పెళ్లి సమయంలో రూ 4ల‌క్షల 30 వేల రూపాయల వ‌ర‌క‌ట్నం ఇచ్చారు. అంతాసాఫిగా సాగిపోతున్న సంసారంలో మూడు నెలలకే కలతలు మొదలయ్యాయి. భార్య ముందే మరో మహిళతో భర్త ఫోన్ లో చాటింగ్ చేయ‌డంతో త‌ట్టుకోలేక కీర్తీ ప్రశ్నించింది.

భర్త కోసం ఓ భార్య రోడ్డెక్కింది. తన భర్త తనకు కావాలంటూ భ‌ర్త ఇంటి ముందు త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ధర్నాకు దిగింది.. న్యాయం కావాలని కోరుతుంది. కుల పెద్దలే కాదు, స‌ఖీ కౌన్సిలింగ్ లోను చెప్పినా ఆ భర్త తన తీరు మార్చుకోవడం లేదు. పెళ్లి చూపుల్లో న‌చ్చి మెచ్చి పెళ్లి చెసుకున్నాడు. మూడేళ్లు కాపురం చేశాక సన్నగా ఉన్నావంటూ వంకలు పెడుతున్నాడు. అందంగా లేవనీ, విడాకులు ఇవ్వాలని ఆ భర్త కోరుతున్నాడు. దీంతో ఆ భార్య తనకు న్యాయం కావాలంటూ ధర్నాకు దిగింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ న‌గ‌రంలోని వీక్లీ మార్కెట్ కు చెందిన వినయ్ కుమార్ కు.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలానికి చెందిన కీర్తితో నాలుగేళ్ల క్రితం పెళ్లి జ‌రిగింది. కీర్తీ తండ్రికి చిన్న నాన్న కూతురు వినయ్ కుమార్ త‌ల్లి. వీరిది మేన‌రికం కావ‌డంతో పెద్దల స‌మ‌క్షంలో ఇరువ‌ర్గాల అంగీకారంతో అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లిచేసారు.

పెళ్లి సమయంలో రూ 4ల‌క్షల 30 వేల రూపాయల వ‌ర‌క‌ట్నం ఇచ్చారు. అంతాసాఫిగా సాగిపోతున్న సంసారంలో మూడు నెలలకే కలతలు మొదలయ్యాయి. భార్య ముందే మరో మహిళతో భర్త ఫోన్ లో చాటింగ్ చేస్తూ దొరికిపోయాడు. దీన్ని త‌ట్టుకోలేక కీర్తీ ప్రశ్నించింది. దీంతో భార్య కీర్తీని చిత‌క బాది ఇంటి నుంచి గెంటేశాడు. నాలుగు నెల‌ల త‌రువాత పెద్దల స‌మ‌క్షంలో మాట్లాడిపించి విన‌య్ ద‌గ్గరకు వ‌చ్చింది. ఆరు నెల‌ల పాటు బాగానే ఉన్నారు. ఆ త‌రువాత రోజు తాగివ‌చ్చి కీర్తీని కొట్టడంతో త‌ల్లిగారి ఇంటికి వెళ్లింది. సంవ‌త్సరం నుంచి త‌ల్లిగారి ఇంటి వ‌ద్దే కీర్తి ఉంటోంది. అయినా విన‌య్ కుమార్ రాలేదు. దీంతో కీర్తీ సఖీ సెంట‌ర్ లో ఫిర్యాదు చేసింది. అక్కడ కౌన్సిలింగ్ కు వ‌చ్చి భార్యను కాపురానికి తీసుకు వెళుతాను అని చెప్పి మాటత‌ప్పారు.

ఇది కూడా చదవండి:  మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్.. చిన్నకూతురిని చంపింది తల్లి పద్మజ కాదు.. ఎవరంటే..

డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహిస్తే అక్కడ కూడా విన‌కుండా వెళ్లి పోయాడు. మ‌ళ్లి కులం పెద్ద మ‌నుషుల మ‌ద్య మాట్లాడుకుందామ‌ని పిలిస్తే అక్కడకు కూడా రావ‌డం లేదు. మూడున్నరేళ్లు కాపురం చేసిన త‌రువాత‌ అందంగా లేవు, సన్నగా ఉన్నావంటూ భర్త వినయ్ ఇంటి నుంచి గెంటేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేస్తోంది. తాను బక్కగా ఉన్నది పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్లి చూపుల్లోనూ కనిపించలేదా అని ఆమె నిలదీస్తోంది. తనకు న్యాయం కావాలని, తన భర్త తనకు కావాలని వేడుకుంటోంది. గత మూడురోజులుగా భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. అయినా ఎవరు పట్టించుకునే నాధుడేలేడని వాపోయింది. తన కూతురుకు న్యాయం చేసే వరకు ఇంటి ముందు నుంచి వెళ్లేది లేదని కీర్తి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విడాకులు ఎందుకు ఇవ్వాలని బాధితురాలి తండ్రి ప్రశ్నిస్తున్నాడు.


ఇది కూడా చదవండి: గుంటూరులో డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. చాటింగ్ లో ఆ మెసేజ్ ల వల్లే దారుణం..!

First published:

Tags: Crime news, Crime story, Hyderabad, Nizamabad, Telangana

ఉత్తమ కథలు