Home /News /telangana /

NIZAMABAD WOMAN THIEF WHO WAS CAUGHT STEALING JEWELERY FROM PASSENGERS IN A BUS IN NIZAMABAD DISTRICT SNR NZB

Nizamabad: బ‌స్టాండ్ అడ్డ‌గా  ఓ కిలాడి లేడి సంవత్సరం నుంచే అదే పాడు పని చేస్తూ బుక్కైంది

(లేడీ ఖిలాడీ)

(లేడీ ఖిలాడీ)

Nizamabad: ఆమె ఆ పని చేయడంలో బాగా ఆరితేరింది. బస్టాండ్‌(Bus standలు), బస్సుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు బస్సులు ఎక్కుతుందో ? ఏం చేస్తుందో జనం అర్ధం చేసుకునేలోపే పని పూర్తి చేసుకొని దిగిపోతుంది. ఈవిధంగా ఏడాది నుంచి సీక్రెట్‌గా మహిళ వెలగబెడుతున్న ఘనకార్యాన్ని పోలీసులు పసిగట్టారు. ఆమెతోనే నిజాన్ని కక్కించారు.

ఇంకా చదవండి ...
  (P.Mahendar,News18,Nizamabad)
  ఆమె ఆ పని చేయడంలో బాగా ఆరితేరింది. బస్టాండ్‌(Bus standలు), బస్సుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు బస్సులు ఎక్కుతుందో ? ఏం చేస్తుందో జనం అర్ధం చేసుకునేలోపే పని పూర్తి చేసుకొని దిగిపోతుంది. ఈ విధంగా సుమారు ఏడాది నుంచి నిజాబామాద్(Nizamabad)జిల్లాలో పోలీసు(Police)లకు, పక్కనే ఉంటున్న వాళ్లకు కూడా తెలియకుండా తన చోరవృత్తిని పర్‌ఫెక్ట్‌గా చేసుకుంటూ వస్తోంది. నేరం, పాపం ఎక్కువ కాలం దాగవని తెలియని లేడీ ఖిలాడీ అదే పని చేస్తూ పోలీసులకు దొరికిపోయింది.

  కష్టపడకుండా డబ్బులు రావాలని..
  పేరు బసనబోయిన యాదలక్ష్మి. నిజామాబాద్ నగరంలోని ఇందిరా ప్రియదర్శినీ కాలనీలో ఉంటుంది. కూలీ ప‌ని చేసుకుంటు జీవ‌నం సాగిస్తుంది. కూలీ పనికి పోతే వస్తున్న డబ్బులు సరిపోకవడంతో ఇంకా బాగా డబ్బు సంపాధించాలని నిర్ణయించుకుంది. ఎలాంటి కష్టం లేకుండా సులువుగా డబ్బులు ఎలా వస్తాయో ఆలోచించింది. అందులో భాగంగానే చోరవృత్తిని ఎంచుకుంది. అందరు దొంగల్లా కాకుండా చాలా తెలివిగా బస్సుల్లో ప్రయాణించే వాళ్లను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని మెడలో నగలు, బంగారు గొలుసులు మాయం చేయడమే పనిగా పెట్టుకుంది. బస్టాండ్‌లో కూర్చొని బస్సు ఎక్కే ప్రయామికుల మెడలో ఎవరి దగ్గర నగలు ఎక్కువగా ఉంటే వారి వెనుకాలే బస్సు ఎక్కుతున్నట్లుగా వెళ్లి నగలు మాయం చేయడంలో యాదలక్ష్మి చాలా ఎక్స్‌పర్ట్.  బస్టాండ్‌లోనే డ్యూటీ ..
  నిజామాబాద్ నుంచి ఆర్మూర్ బస్టాండ్‌కు వెళ్లే బస్సుల్లో తరచూ చోరీలు జరగుతున్నాయి. బస్సులు ఎక్కే ప్రయాణికుల హ్యాండ్ బ్యాగుల్లో, మెడలో ఆభరణాలను దొంగిలిస్తోంది యాదలక్ష్మి. ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో నగలు పోగొట్టుకున్న వాళ్లంతా ఆర్మూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మారు వేషాల్లో ఆర్మూర్ బస్టాండ్ దగ్గర డ్యూటీ చేస్తూ ఈ నగల దొంగను గుర్తించేందుకు తిష్ట వేశారు. సోమవారం సాయంత్రం ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో యాదలక్ష్మి అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించారు. ఆమెపై ఓ కన్నేసి ఉంచారు.

  Nizamabad : ఎన్ని సినిమాలు చూస్తే ఇలాంటి బ్యాంక్ రాబరీ చేయాలి .. చిన్న క్లూ కూడా దొరక్కకుండా కోట్లు కొల్లగొట్టారు  సింగిల్‌ లేడీపై 14కేసులు..
  పోలీసులు పసిగట్టినట్లుగా ఆమె నగలు మాయం చేస్తోందని క్లారిటీ కావడంతో మంగళవారం యాదలక్ష్మిని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలీలో విచారించడంతో నిజాన్ని కక్కింది యాదలక్ష్మి. నిందితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు బస్టాండ్‌ పరిసరాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. యాదలక్ష్మి దగ్గర నుంచి చోరీ చేసిన నగల్లో 55 తులాల బంగారు అభరణాలను రికవరీ చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు. అంతే కాదు యాదలక్ష్మీపై 14 చోరీ కేసులు ఉన్నట్లుగా తెలిపారు. ఆమె దొంగతనం చేసిన నగల విలువ 27లక్షల 50వేలు ఖరీదు చేస్తుందని సీపీ తెలిపారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జల్సాలకు ఖర్చు చేసుకుంటున్నట్లుగా నిందితురాలు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. బస్సుల్లో ప్రయాణించే వాళ్లు యాదలక్ష్మి లాంటి మహిళలు, అనుమానాస్పదవ్యక్తులు వెంట వస్తుంటే కాస్త గమనించాలని నగలు, ఆభరణల పట్ల జాగ్రత్త పరుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

  Crime news : ఇంటికొచ్చిన యువకుడ్ని పట్టుకొని చావబాదారు..వివాహేతర సంబంధమే కారణమంటున్న గ్రామస్తులు


   

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Nizamabad, Telangana crime

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు