హోమ్ /వార్తలు /తెలంగాణ /

Narayanpet: మరికొన్ని గంటల్లో పెళ్లి..ఫ్యాన్‌కి శవమై వేలాడింది..వాడు ఆ పని చేసినందుకే..

Narayanpet: మరికొన్ని గంటల్లో పెళ్లి..ఫ్యాన్‌కి శవమై వేలాడింది..వాడు ఆ పని చేసినందుకే..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Narayanpet:పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లాల్సిన నవ వధువు శవంగా మారింది. ఇంట్లో అంతా పెళ్లి పనుల్లో ఉండగా చున్నీతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలుసుకున్న ఓ యువకుడు ప్రేమించమని పెడుతున్న టార్చర్‌ భరించలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లుగా సూసైడ్‌ లెటర్ రాసింది.

ఇంకా చదవండి ...

వన్‌సైడ్‌ లవ్‌ ఆ అమ్మాయి ప్రాణం తీసింది. ఇష్టం లేదురా బాబు అని చెబుతున్నా అమ్మాయిల వెంటపడితే ఏం చేస్తారు. అది కూడ వేరే వ్యక్తితో నిశ్చితార్ధం జరిగిన అమ్మాయికి అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కబోతున్న నవ వధువు ప్రేమ పేరుతో యువకుడు పెట్టే వేధింపులు భరించలేక చివరకు ప్రాణం తీసుకున్న ఘటన నారాయణపేట (Narayanpeta) జిల్లాలో చోటుచేసుకుంది. వన్‌ సైడ్ లవ్ (One Side Love)వ్యవహారం ఇంట్లో చెప్పుకోలేక..ప్రేమ పేరుతో వేధిస్తున్న వెదవ టార్చర్ భరించలేక ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. నారాయణపేట జిల్లా మక్తల్‌(Maktal)మండలం చందాపూర్‌(Chandapur)కి చెందిన 19సంవత్సరాల భీమేశ్వరి(Bhimeshwari)అనే యువతికి పది రోజుల క్రితం నిశ్చితార్ధం(Engagement)జరిగింది. దండు (Dandu)గ్రామానికి చెందిన యువకుడితో భీమేశ్వరి తల్లిదండ్రులు మంగళవారంTuesday పెళ్లి(Marriage)కి ముహుర్తం పెట్టారు. భీమేశ్వరి తల్లిదండ్రులు వెంకయ్య(Venkaiah), పద్మమ్మ(Padmamma)ఇంట్లో పెళ్లి వేడుకల ఏర్పాట్లలో ఉన్నారు. బంధువులు, కుటుంబ సభ్యులతో ఇంట్లో సందడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం ఉదయం వివాహ నిశ్చితార్ధం జరగాల్సి ఉండగా ముందు రోజే భీమేశ్వరి ఇంట్లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకొని(Hanging)సూసైడ్ (Suicide)చేసుకుంది.

పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి..

మరికొన్ని గంటల్లో పెళ్లి పెళ్లి చేసుకొని ఇంకొకరి ఇంటికి వెళ్లాల్సిన కూతురు ఇంట్లోనే విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే భీమేశ్వరి అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని గమనించిన తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. మృతురాలు భీమేశ్వరికి నిశ్చితార్ధం జరిగిన విషయం తెలుసుకున్న చందాపూర్‌ గ్రామానికి చెందిన లిక్కి అలియాస్‌ సిరిపి నర్సింహులు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని..అతని టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్‌ రాసి మరీ చనిపోయింది భీమేశ్వరి. బిడ్డ చావుకు ఓ పోకిరీ వెదవ అని తెలిసి మృతురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం లేదని చెప్పినా ప్రేమ  పేరుతో అమ్మాయిల ప్రాణాలు తోడేసే అలాంటి వెదవల్ని వదలవద్దని డిమాండ్ చేస్తున్నారు.

శవ పేటిక ఎక్కింది..

పెళ్లి పీఠలపై కూర్చోవాల్సిన బిడ్డ శవ పేటికపై పడుకోబెట్టాల్సిన దుస్థితి రావడం చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతురాలి దగ్గరున్న సూసైడ్‌ లెటర్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు.పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు లిక్కి పరారీలో ఉండటంతో అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకొని పూర్తి వివరాలు రాబట్టిన తర్యాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Mahabubnagar

ఉత్తమ కథలు