(Mahender P, News18, Nizamabad)
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో టీఆర్ఎస్ (TRS) పార్టీ మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. పకడ్బంది గా ఎమ్మెల్యేల గ్రాఫ్‌ను పీకే ఐప్యాక్ (I PAC) బృందంతో సర్వేలు చేయించారు. అయితే ఆ సర్వే రిపోర్ట్ (Survey Report) పై సీఎం కేసీఆర్ (CM KCR) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరు ఉంటారు..? ఎవరు పోతారు అనే విషయాలు తేలాల్సి ఉంది.. అయితే నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ని ఐదుగురు ఎమ్మెల్యేల భవిషత్తు ఇపుడు చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినా తరువాత మొదటి సారి వచ్చిన 2014 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు 9 చోట్ల విజయం సాధించారు. 2018 శాసన సభ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో ఐదు స్థానాలాకు ఐదు.. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో నాలుగు స్థానాలకు మూడు స్థానాల్లో విజయం సాధించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో బాల్కోండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ ఆర్బన్ , బోధన్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వరుసగా రెండో సారి విజయఢంకా మోగించింది.
అనంతరం నాలుగు నెలల తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సీఎం తనయ కల్వకుంట్ల కవిత (K Kavita) ఓటమి పాలయ్యారు. దీంతో జిల్లా పై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పీకే తన ఐప్యాక్ బృందం ప్రత్యేకంగా సర్వే చేయించారు. పీకే (PK) బృదం సర్వే నివేదిక సీఎం కేసీఆర్ చెంతకు చేరింది. అయితే ఆ సర్వేకోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్, ఆర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, ఆర్మూర్ ఆశన్న గారి జీవన్ రెడ్డి.. బోధన్ షాకిల్ ఆమీర్ రిజల్ట్ (Results) కోసం ఎదురుచూస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనే నేపథ్యంలో..
నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజవకర్గాల్లోని ప్రతిపక్ష, ఆశావహుల బలాలు, బలహీనతలను కూడా బేరీజు వేసుకుంటూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) పనితీరు.. తన వ్యవహార శైలి.. నడవడిక.. అక్రమాలు.. పర్సంటేజీలు.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా.. లేదా.. భూ దందాలు, దాడులు చేయించడం తదితర అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి పీకే (Prashanth Kishore) ఐ ప్యాక్ (PK I PAC) బృదం సర్వే చేసినట్లు తెలుస్తోంది.. జిల్లా నుంచి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనే నేపథ్యంలో అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆకుల లలితకు టికెట్..?
అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సోషల్ మీడియాలో పలు వివాదలకు కేంద్ర బిందువు అయ్యాడు.. ఆటూ నిజామాబాద్ ఎంపి దర్మపూరి ఆర్వింద్ కూడా ఆర్మూర్ నుంచి పోటి చేసి జీవన్ రెడ్డిని 50వేల మెజార్టీతో ఓడిస్తానని సవాల్ చేశారు. దీంతో ఆర్మూర్ విషయంలో సామాజిక వర్గం ఓటర్లను కూడా బెరీజు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ను కొనసాగిం చాలా లేక ఆర్వించ్ సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలితకు టికెట్ కేటాయించాలా అనే విషయమై కూడా లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కవిత ను బరిలోకి దింపుతారనే చర్చ పార్టీ వర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల్లో జరుగుతోంది. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం విషయానికి వస్తే గణేష్ గుప్తా పని తీరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రత్యర్థులు ఎవరెవరుంటారు. గెలుపోటముల పరిస్థితి ఏమిటనే విషయమై లెక్కలు వేసి సర్వే నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది.. బోధన్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే షకిల్ పనితీరును కూడా అంచనా వేస్తున్నారని సమాచారం. చివరకు ముచ్చటగా మూడోసారి శాసన సభ బరిలో దిగే ఎమ్మెల్యేలు ఎవరో తేలాలంటే మరి కోన్ని రోజులు వేచిచూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Prashant kishor, Trs